Site icon HashtagU Telugu

PM Modi – AP Bifurcation : తెలుగు ప్రజలను బాధపెట్టి ఏపీని విడగొట్టారు.. పార్లమెంటులో ప్రధాని కామెంట్స్

Pm Modi Speech

Pm Modi Speech

PM Modi – AP Bifurcation : ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన  నాటి పరిస్థితుల గురించి పార్లమెంటులో వివరించారు. ‘‘అంతకుముందు చాలా రాష్ట్రాల విభజన జరిగింది. ఒక రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టిన టైంలో.. రెండు రాష్ట్రాల్లోని ప్రజలంతా హ్యాపీగా సంబరాలు చేసుకున్నారు. కానీ ఏపీ విభజన టైంలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించలేదు’’ అని మోడీ చెప్పుకొచ్చారు. పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ.. 75 ఏళ్ల భారత పార్లమెంటు ప్రస్థానంపై ప్రసంగించే క్రమంలో ప్రధాని మోడీ ఈ అంశాలను ప్రస్తావించారు. ‘‘ఎన్నో చారిత్రక ఘట్టాలు పాత పార్లమెంటు భవనంలో ఆవిష్కృతం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా పాత పార్లమెంట్‌లోనే జరిగింది’’ అని ఆయన గుర్తుచేశారు.

Also read : PM Modi – Parliament : స్పెషల్ పార్లమెంట్ సెషన్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే

‘‘పార్లమెంట్ పాత భవనాన్ని భారతీయుల స్వేదం, డబ్బుతో నిర్మించాం. ఈ భవనం ఎప్పుడూ మనల్ని ఉత్తేజ పరుస్తూనే ఉంటుంది. 75 ఏళ్లలో ఎన్నో చారిత్రక నిర్ణయాలను ఈ భవనంలో తీసుకున్నాం. ఈ భవనం భావి తరాలకు స్ఫూర్తినిస్తుంది. చరిత్రను గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది. పార్లమెంట్‌లో నేను తొలిసారి అడుగు పెట్టినప్పుడు ఎంతో భావోద్వేగం చెందాను. నాలాంటి పేదవాడు పార్లమెంట్లో అడుగు పెట్టడం గొప్ప విషయం. పార్లమెంట్ అన్ని వర్గాల వారికీ ప్రాతినిధ్యం కల్పించాలి. ఎంతో మంది మహిళా ఎంపీలు.. పార్లమెంట్ గౌరవాన్ని పెంచారు. మహిళా ఎంపీల సంఖ్య పార్లమెంట్‌లో పెరుగుతోంది’’ అని ప్రధాని మోడీ (PM Modi – AP Bifurcation)  తెలిపారు.  ‘‘పార్లమెంట్‌పై ఈ దేశంలో ప్రతి సామాన్యులకూ నమ్మకం కలిగింది. గత ప్రధానులంతా దేశాన్ని ముందుకు నడిపించారు. వారంతా ఈ సమావేశాల్లో రకరకాల అంశాలపై చర్చలు జరిపి, ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు’’ అని పేర్కొన్నారు.

Exit mobile version