Pm Modi: ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి IT పార్కు వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఉ.8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉ.10.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని, ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు.
మరోవైపు చంద్రబాబు ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ ప్రక్కన జరిగే పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జర్మన్ హ్యాంగర్స్‌తో భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్జేజీని సిద్ధం చేస్తున్నారు. స్టేజీ పనులను తిరుపతి జేసీ ధ్యాన్‌చందర్, వైజాగ్ వీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పర్యవేక్షిస్తున్నారు.
