Site icon HashtagU Telugu

Krishna District : కృష్ణా జిల్లాలో విషాదం.. పాముని ప‌ట్టుకునేందుకు వెళ్లిన పూజారి..?

Krishna Imresizer

Krishna Imresizer

పాముకాటుకు పూజారి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా కృత్తివెన్ను పంచాయతీ గుడిదిబ్బ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన కొండూరి నాగబాబు(48) ఆధ్యాత్మికత, అర్చకత్వం నేర్పుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం నాగబాబు పాము ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పీతలవ గ్రామంలోని రొయ్యల దాణా షెడ్డు వద్దకు వెళ్లాడు. పామును పట్టుకున్న వెంటనే అది అతని చేతికి రెండుసార్లు కాటు వేసింది. అయితే పామును సురక్షిత ప్రాంతంలో వదిలేశాడు. తర్వాత తనకు తెలిసిన సొంత మందులు వేసుకుని పరిస్థితి విషమించడంతో వెంటనే మచిలీపట్నంలోని ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఆదివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా వేలాది మంది ఆయన మృతదేహాన్ని సందర్శించారు. నాగబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగబాబు తండ్రి కొండూరి గోపాలకృష్ణ శాస్త్రి చాలా ఏళ్లుగా అర్చక వృత్తి చేస్తూ పాము, తేలు కాటుకు వైద్యం చేసేవారు. ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోకుండా పాముకాటుకు విరుగుడు ఇస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. శాస్త్రి చనిపోయాక ఆయన పెద్ద కుమారుడు నాగబాబు పాముకాటుకు మంత్రాలు వేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు.