Site icon HashtagU Telugu

Varupula Raja : ప్ర‌త్తిపాడు టీడీపీ ఇంఛార్జ్‌ వ‌రుపుల రాజా క‌న్నుమూత‌.. సంతాపం తెలిపిన చంద్ర‌బాబు, లోకేష్‌

varupula raja

varupula raja

టీడీపీ యువ‌నేత‌, ప్ర‌త్తిపాడు ఇంఛార్జ్ వ‌రుపుల రాజా క‌న్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయ‌న్ని కుటుంబ‌స‌భ్యులు ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ ఆయ‌న మ‌ర‌ణించారు. వరుపుల రాజా మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సంతాపం తెలిపారు. వరుపుల రాజా మృతి పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుతో రాజా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీ కి తీరని లోటని అన్నారు. రాజా కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మీయ స్నేహితుడు వరుపుల రాజా ఆకస్మిక మృతి షాక్ కి గురి చేసిందన్నారు మాజీ మంత్రి నారా లోకేష్‌. తెలుగుదేశం కుటుంబం యువ నేతను కోల్పోయిందని.. బాధాతప్త హృదయంతో నివాళులు అర్పిస్తున్నానన్నారు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న రాజా మృతి టిడిపికి తీరని లోటని.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని లోకేష్ తెలిపారు.

Varupula Raja

వరుపుల రాజా ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమ‌ని.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. పార్టీ బలోపేతం కోసం వరుపుల రాజా చేసిన సేవలు చిరస్మరణీయమ‌న్నారు. డీసీసీబీ ఛైర్మన్‍గా ఆయన చేసిన సేవలు ఎనలేనివని… వరుపుల రాజా కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నామ‌న్నారు.

Exit mobile version