Site icon HashtagU Telugu

Prashanth Kishore : నారా లోకేష్‌తో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటి..!

Nara Lokesh

Nara Lokesh

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం హీటెక్కింది. యువ‌గ‌ళం స‌క్సెస్ జోష్‌తో ఉన్న టీడీపీ దూకుడుని ప్ర‌ద‌ర్శిస్తుంది. మ‌రో రెండు నెల‌ల్లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌నే సంకేతాలు వెలువ‌డుతుండ‌టంతో టీడీపీ వ్యూహాల‌ను సిద్ధం చేస్తుంది. ఇందుకోసం ఇప్ప‌టికే పొలిటిక‌ల్ స్ట్రాటజిస్ట్‌ల‌ను ఏర్పాటు చేసుకుంది. తాజాగా మ‌రో అడుగు ముందుకేసి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి విజ‌యం అందించిన స్ట్రాటజిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌మావేశానికి ఆహ్వానించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్ర‌శాంత్ కిషోర్‌ని నారా లోకేష్ లోప‌లికి వెళ్లి స్వాగ‌తం ప‌లికారు. ఒక్కసారిగ గన్నవరం విమానాశ్రయం లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వెంట ప్ర‌శాంత్ కిషోర్ కనిపించటంతో రాజ‌కీయాలు మరింత వెడెక్కాయి. ఇద్ద‌రు క‌లిసి ఓకే వాహనంలో రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఉండ‌వ‌ల్లిలో చంద్ర‌బాబుతోప్ర‌శాంత్ కిషోర్ భేటి కానున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాల‌ను టీడీపీ వినియెగించుకోనున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన విష‌యాల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.