ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి వారి లక్ష్యాలను నెరవేర్చేలా జగన్ కు తాను సాయచేయడం కంటే.. కాంగ్రెస్ పునరుజ్జీవనం కోసం కృషి చేస్తే బాగుండేదన్నారు. అసలైన మహాత్మాగాంధీ కాంగ్రెస్ కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడిస్తామని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాని అన్నారు.
బీహార్ లో 3,500కిలో మీటర్ల పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్, పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాషాయ దళం విజయయాత్రను అడ్డుకోవడంతో విపక్షాల కూటమి సమర్థతపై పీకే అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీని అర్ధం చేసుకోకుండా ఆ పార్టీని ఓడించడం కష్టమన్నారు. అయితే కాంగ్రెస్ ను ఉద్దేశించి పీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Also Read: AP : సీఎం జగన్ గుడ్ న్యూస్…ఆ ఉద్యోగులంతా EHS పరిధిలోకి..!!
ఇక బీహార్ సీఎం పైనా పీకే విమర్శల పరంపర కొనసాగించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ ఎంపీలు పార్లమెంటులో అనుకూలంగా ఓటేశారని తెలియడంతో చాలా బాదపడినట్లు తెలిపారు. ఈ విషయంపై నితీష్ కుమార్ నుతాను నిలదీసినట్లు చెప్పారు. బీహార్ లో ఎన్ఆర్సీ అమలు కానివ్వమని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. రెండు నాలుకల విధానం చూశాకే.. నితీష్ తో పనిచేయకూడదని అర్థమైందని చెప్పారు.