Prashant Kishore : జగన్ ఓటమి ఖాయం.. టీడీపీలోకి బొత్స జంప్ : పీకే సంచలన వ్యాఖ్యలు

Prashant Kishore : ఆంధ్రప్రదేశ్​లో  పోలింగ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉందనగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిషోర్​ సంచలన కామెంట్స్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Prashant Kishore

Prashant Kishore

Prashant Kishore : ఆంధ్రప్రదేశ్​లో  పోలింగ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉందనగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిషోర్​ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో జగన్​కు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. 2019లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు ‘నవరత్నాలను’ తానే సూచించానని చెప్పిన పీకే(Prashant Kishore).. గెలిచిన తర్వాత జగన్ వాటిని సరిగ్గా అమలు చేయలేకపోయారని పేర్కొన్నారు. వాటి పర్యవసానం ఎన్నికల ఫలితంలో కనిపిస్తుందని ఆయన చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఎన్నికల్లో ఓటమికి చేరువయ్యారనే విషయాన్ని తాను జగన్‌కు 18 నెలల క్రితమే చెప్పానని పీకే వెల్లడించారు. ‘‘నేను అందరి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాను. ఎందుకు గెలవను. మాకు 155 అసెంబ్లీ సీట్లు వస్తాయి’’ అంటూ జగన్ నాతో వాదించారు. ఆనాటి నుంచి నేటిదాకా మళ్లీ జగన్ ను తాను కలవలేదని స్పష్టం చేశారు. జగన్  పాలనలో ఎన్నో తప్పులున్నాయని, దానివల్ల ఈ ఎన్నికల్లో వైసీపీ భారీగా నష్టపోబోతోందని వెల్లడించారు.  ‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పూర్తిగా దారి తప్పారు. వాలంటీర్లను నియమించుకోవడం అనేది నా ఆలోచన కాదు. ఆ వ్యవస్థ కారణంగా వైఎస్సార్ సీపీ క్యాడర్ నిర్వీర్యమైంది’’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను ఐప్యాక్ కోసం పనిచేయడం లేదని పీకే స్పష్టం చేశారు.

Also Read :Free Electricity : ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్ 10 సంచలన హామీలు

‘‘స్జజల రామకృష్ణారెడ్డి లాంటివారు 151 సీట్ల వైఎస్సార్ సీపీని 51 సీట్లకు తీసుకొస్తున్నారు. నేను ఎవరు డబ్బులిస్తే వారిపై మాట్లాడుతానని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదు. జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో తెలుసుకోవాలి’’ ప్రశాంత్ కిశోర్ కామెంట్స్ చేశారు.

Also Read :Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క

‘‘బొత్స టీడీపీలోకి వెళ్లడానికి ఒప్పందం చేసుకున్నారు. గెలిచిన పార్టీలోనే ఉండాలని బొత్స అనుకుంటారు. మూడు రాజధానులకు సంబంధించిన ఆలోచన కూడా నాది కాదు. జగన్ దే ఆ ఆలోచన. 2019లో వైసీపీ విజయం సాధించిన తర్వాత నేను ఇంతవరకు సేవలు అందించలేదు. ఐప్యాక్ మాత్రం ఇప్పటికీ సేవలు అందిస్తోంది’’ అని ప్రశాంత్ కిశోర్ వివరించారు.

Also Read : Payal Rajput : ఈసారి పోలీసాఫీసర్ గా అదరగొట్టబోతున్న పాయల్ రాజ్‌పుత్..

  Last Updated: 12 May 2024, 05:06 PM IST