ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. అయితే.. ఇప్పటికే ఏపీలో వార్ వన్ సైడేనని డిసైడయ్యారు ఏపీ వాసులు. వైసీపీని గద్దెదించి టీడీపీ కూటమికి పట్టం కట్టాలని ఫిక్స్ అయ్యారు. ఏపీలో వాతావరణం గెలుపు సంబరాలను అలుముకుంది. అయితే.. మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ.. మనమే గెలుస్తామని వైసీపీ నేతలు కేడర్‌లో విశ్వాసం నింపుతున్నారు. అంతేకాకుండా.. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం జగన్ సైతం 150 పైగా స్థానాల్లో గెలుస్తామని కేడర్‌లో జోష్ పెంచే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ టీడీపీ గెలుపుపై తెలుగు తముళ్లలో కనిపించే విశ్వాసం ముందు ఆ జోష్ పనిచేయలేదు. అయితే.. దీనికి తోడు సర్వేలు సైతం జగన్‌కు వ్యతిరేకంగానే వస్తుండడం వైసీపీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇదే సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనాలు వైసీపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి..
We’re now on WhatsApp. Click to Join.
అయితే.. తాజాగా 2024 ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో ఓడిపోతారని గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. అతను గత కొన్ని నెలలుగా ప్రతి ఇంటర్వ్యూలో ఈ అంచనాను మళ్లీ ధృవీకరించాడు. మరోవైపు 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సహకారంతో గెలుపొందిన సీట్ల సంఖ్యను అధిగమిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి తన గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, జగన్ ప్రకటన గురించి అడిగినప్పుడు, ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే తాము ఓడిపోతామని ఏ నాయకుడు ఒప్పుకోడు.
జగన్ మోహన్ రెడ్డి అయినా, రాహుల్ గాంధీ అయినా, అమిత్ షా అయినా అందరూ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పారు. నా పదేళ్ల అనుభవంలో ఎన్నికలకు ముందు ఓటమిని అంగీకరించడం నేను ఎప్పుడూ చూడలేదు. “కౌంటింగ్ రోజు కూడా, వారి పార్టీ నాలుగు రౌండ్ల తర్వాత వెనుకబడి ఉంటే, తదుపరి రౌండ్ నుండి తమ పార్టీ మెజారిటీని పొందడం ప్రారంభిస్తుందని వారు ఇప్పటికీ పేర్కొంటారు,” అన్నారాయన.
2019 కంటే భారీ విజయం సాధిస్తామన్న జగన్ ప్రకటనపై ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. 151 సీట్లకు మించి గెలిస్తే ఇబ్బంది నాకే. వారు చేయకపోతే నా అంచనా సరైనదైతే ఇబ్బంది జగన్ మోహన్ రెడ్డికే” అని అన్నారు. ఇలాంటి అంచనాలు వేయడంలో జాగ్రత్తగా ఉండాలని ప్రశాంత్ కిషోర్ నొక్కి చెప్పారు. అందుకే తాను ఎప్పుడూ నిర్దిష్ట సీట్ల ఫలితాలు, మెజారిటీలను అంచనా వేయనని, జాతీయ తరంగం ఆధారంగా మొత్తం ట్రెండ్‌పై దృష్టి సారిస్తానని ఆయన వివరించారు.
Read Also : Telangana Politics : మరో ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న తెలంగాణ..!