పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ (Pawan Kalyan – Prakash Raj) మధ్య ఉన్న రాజకీయ విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. నిత్యం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్ మరోసారి జనసేనాని పై విమర్శలు గుప్పించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్‌కు విజన్ లేదని, సమస్యలపై అవగాహన లేదు అని విమర్శించారు. తమిళనాడులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్‌ను, పవన్‌ను పోల్చుతూ.. “నలుగురి పేర్లు తెలిసినంత మాత్రానా రాజకీయం చేయలేరని” అంటూ కామెంట్ చేశారు. వీరిద్దరూ 20 ఏళ్లుగా తనకు తెలిసినవారని, కానీ పాలిటిక్స్ గురించి వారు సీరియస్‌గా మాట్లాడిన దాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.
Chamala : పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ చామల
పవన్ ఎవర్ని అర్థం చేసుకోడు, అర్థం కారు అంటారు కదా.. ఆయనకు అసలు ఏమి తెలియదు అంటూ సెటైర్లు వేశారు. ఎంజీఆర్, పెరియార్ వంటి నేతల పేర్లు చెప్పుకుంటూ గొప్పలు చెప్పడం మాత్రమే చేస్తారని.. సమస్యలపై స్పష్టత లేదని అన్నారు. తన నియోజకవర్గంలో కుల వివక్ష, బహిష్కరణలు జరుగుతున్నా వాటిపై స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల విషయాలపై స్పందించేవారు తమ ప్రాంతంలోని అసలు సమస్యలను పట్టించుకోరంటూ ఆరోపించారు.
ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ పై పవన్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ట్రోలింగ్, ప్రతిస్పందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా వీరిద్దరి మధ్య విభేదాలు కొత్తేమీ కాకపోయినా, ఈసారి మాటల యుద్ధం మరింత గరిష్ట స్థాయికి చేరుతుందని అంచనా.
