ప్రకాశం బ్యారేజ్ ప్రమాదం అంచున ఉందా..? విజయవాడ కు పెను ప్రమాదం ముచ్చుకొస్తోందా..? అంటే అవుననే చెప్పాలి. అల్ప పీడన ప్రభావం తో గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP & Telangana) విస్తారంగా వర్షాలు (Rains) పడుతున్న సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు పడుతుండడం తో పలు నగరాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) నగరంలో అతలాకుతలం అయ్యింది. ప్రకాశం బ్యారేజీ, బుడమేరు వరద విజయవాడను అల్లకల్లోలం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది పొంగి పొర్లుతుంది. ఈ నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల, కృష్ణ బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణ బ్యారేజీ (Prakasam Barrage)కి ఒక్కసారిగా వరద పోటెత్తింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకొచ్చింది. వేగంగా వచ్చిన బోటు ప్రకాశం బ్యారేజీ గేటు 69ను ఢీ కొన్నది. ఈ ఘటనలో గేటు లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజీ అయ్యింది. ఆ తర్వాత మరో రెండు , మూడు బొట్లు వచ్చి బలంగా ఢీ కొట్టడం తో బ్యారేజ్ లోని మూడు తూములకు డ్యామేజ్ అయ్యింది. ఇలా వరుసగా బొట్లు కొట్టుకురావడం తో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో వైసీపీ హయాంలో చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకు బోటు అడ్డు తగిలిందంటూ నీటి ప్రవాహాన్ని పెంచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా బ్యారేజీని డ్యామేజీ చేయడానికి అలాంటి ప్రయత్నం ఏమైనా చేసారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలాంటి పనులు చేస్తున్నారా..? ఈ మొత్తం వ్యవహారం ఒకవేళ ఇదే నిజమైతే దీని వెనుకున్న సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? అని అంత మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రకాశం బ్యారేజ్ కి డ్యామేజ్ అనే వార్త నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే నగరంలో నీటిలో ఉండగా..ఇప్పుడు బ్యారేజికి ఏమైనా జరిగితే ఎలా అని ఖంగారు పడుతున్నారు.
Read Also : Pawan Kalyan Birthday : పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన బన్నీ..వార్ చల్లారినట్లేనా..?