ప్రకాశం బ్యారేజ్ గేట్లను (Prakasam Barrage Gates Damaged) బోట్లు ఢీకొట్టిన ఘటనలో పెద్ద కుట్ర దాగి ఉందని తెలుస్తుంది. కావాలనే బోట్లను బ్యారేజ్ లోకి వదిలినట్లు తెలుస్తుంది. ఈ ఘటన కు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. రాంమోహన్, ఉషాద్రి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బోట్లు తమవేనని ఇప్పటివరకూ ఎవరూ రాకపోవడంతో ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని పోలీసులు సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు నివేదిక అందించారు. బ్యారేజు ఢీకొట్టిన పడవలు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ (MLC Talasila Raghuram ), మాజీ ఎంపీ నందిగం సురేష్ (Ex MP Nandigam Suresh) అనుచరుల బోట్లుగా గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు.
బోట్లు రిజిస్ట్రేషన్ల నంబర్ ఆధారంగా యాజమానులను గుర్తించామని అధికారులు నివేదికలో వెల్లడించారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లును కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందని వెల్లడించారు. బోట్లును ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు అధికారులు గుర్తించారు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేసి ఉంటారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ (CM Jagan) కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలశిల రఘురాం కు రామ్మోహన్ చాలా దగ్గర బంధువు అని పోలీసులు అన్నారు, రామ్మోహన్ కు ఉషాద్రి చాలా సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని పోలీసులు అంటున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు కూడా ఈ ఉషాద్రి చాలా సన్నిహితుడు అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నందిగం సురేష్ కు చెందిన అక్రమ ఇసుక వ్యాపారంలో ఉషాద్రి సహకరించేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నందిగం సురేష్ సుమారు 100 సొంత లారీలు, అద్దె లారీలలో అక్రమంగా ఇసుకను అమరావతికి తరలించాడని, రాత్రిపూట నందిగం సురేష్ లారీలకు ఉషాద్రి ఇసుక లోడ్ చేయించే వాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ విషయం బయటకు రావడం తో ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నీచానికి పాల్పడతారా..? ఇది నిజమని తేలితే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read Also : BJP : అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్