Prakasam Barrage Boats Remove Operation : ఈ ప్లాన్ నైనా వర్కవుట్ అవుద్దా..?

Prakasam Barrage Boats Remove Operation : ఈరోజు బోట్లను నీటిలోనే కత్తిరించి, తొలగించే పక్రియ మొదలుపెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Removing Boats In Prakasam

Removing Boats In Prakasam

ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) గేట్లను ఢీ కొట్టి (Boats Crash) ఇరుక్కుపోయిన బోట్ల ను తొలగించడం అధికారులకు చెమటలు పట్టిస్తుంది. గత కొద్దీ రోజులుగా ఈ బోట్ల ను తొలగించాలని శ్రమిస్తున్న వర్క్ అవుట్ కావడం లేదు..ఈరోజు బోట్లను నీటిలోనే కత్తిరించి, తొలగించే పక్రియ మొదలుపెట్టారు. ఇందుకోసం విశాఖపట్నం నుంచి ప్రత్యేక బృందాలు తీసుకొచ్చారు. దాదాపు 120 టన్నుల సామర్థ్యం ఉన్న ఎయిర్‌ బెలూన్స్‌ రంగంలోకి తీసుకొచ్చారు. ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని అంత నమ్ముతున్నారు. గతంలో ఇలాంటి ప్లాన్స్ వర్క్ అవుట్ అయ్యాయని పేర్కొంటున్నారు.

బోట్లను వదలడం ఖచ్చితంగా వైసీపీ కుట్రే అని ఏపీ మంత్రి రామానాయుడు (AP Minister Nimmala Ramanaidu) అంటున్నారు. మూడు బోట్లు ఒక దానికొకటి కలిపి కట్టి ఉంచారని, ఒక్క పడవ బరువు 40 టన్నులు ఉందని తెలిపారు. మూడూ కలిపి మొత్తం 120 టన్నులుగా బ్యారేజీని ఢీకొట్టేలా పంపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్లు కౌంటర్‌ వెయిట్స్‌ను కాకుండా, కట్టడాలను తాకి ఉంటే మూడు జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని , వరదలోనూ రూ.1.50 కోట్ల విలువైన బోట్లకు లంగరు వేసుకోలేదంటేనే ఇది కుట్ర అని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

Read Also : New Medical Colleges : కేసీఆర్ కల సాకారమైంది – హరీశ్ రావు

  Last Updated: 11 Sep 2024, 12:05 PM IST