Site icon HashtagU Telugu

KA Paul Song : దుమ్ములేపుతున్న ‘కే పాల్’ సాంగ్

Pal Song

Pal Song

ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) తమ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇదే సందర్బంగా పలు పార్టీల ప్రచార పాటలు సైతం సోషల్ మీడియా లో దుమ్ములేపుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ గద్దర్ పాడిన పాటలు ఓ రేంజ్ లో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ సాంగ్ (Praja Shanti Party
Song) సైతం ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

‘అన్నా అన్నా కేఏ పాలన్నా’ అని లిరిక్స్‌తో ఉన్న పాటను పార్టీ అధినేత కేఏ పాల్..సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి..ఈ పాటను అందరూ షేర్ చేయాలని పిలుపునిచ్చారు. తుప్పు సైకిల్ మాకొద్దన్నా.. పగిలే గ్లాసులు మాకొద్దన్నా.. తిరగని ఫ్యానులు మాకొద్దన్నా.. వాదే పువ్వులు మాకొద్దన్నా.. అంటూ టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీలఫై సెటైర్లు వేస్తూ ఈ పాట సాగింది. ఇక ఈసారి ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) కి కేంద్ర ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించింది. గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా కేఏ పాల్ పోటీ చేస్తున్నారు. ఇక రేపు విశాఖలో ఆయన నామినేషన్లు వేయబోతున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ఆంధ్రలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే… తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా.. ఆంధ్రాను (Andhrapradesh) అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని..‘‘నన్ను గెలిపిస్తే… మీరు షాక్ అవుతారు’’.. అంతా అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు. మరి పాల్ హామీలను గుర్తు పెట్టుకొని ఎంతమంది ఓటు వేస్తారో చూడాలి.

Read Also : Pakistan Rains 2024: పాక్‌లో వర్షాల బీభత్సం.. 71 మంది మృతి