Prajagalam : చంద్రన్న కోసం మండుటెండను సైతం లెక్క చేయట్లే..

మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలను బాగుండాలనే సంకల్పంతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రజాగళం అనే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Babu Pajagalam

Babu Pajagalam

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 10 దాటితే కాలు బయటకు పెట్టలేని పరిస్థితి..ఏ పని ఉన్న ఉదయమే చూసుకొని వచ్చేస్తున్నారు. పెద్ద వయసు ఉన్న వాళ్ళైతే ఎండకు విపరీతంగా బయటపడుతున్నారు. ఇలాంటి ఈ పరిస్థితిల్లో మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలను బాగుండాలనే సంకల్పంతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రజాగళం అనే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో ఎన్నికలకు కొద్దీ రోజుల సమయమే ఉండడం తో చంద్రబాబు తన దూకుడు ను మరింత పెంచారు. తన కోసం వచ్చిన ప్రజలను నిరాశ పరచకుండా మండుటెండను సైతం లెక్క చేయకుండా వారిని కలుస్తూ..టీడీపీ భరోసాలు తెలియజేస్తూ పర్యటన ను కొనసాగిస్తున్నారు. ప్రజాగళం (Prajagalam ) రెండో విడతలో భాగంగా మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రచార వేగం పెంచారు. ప్రజాగళం పేరిట రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాలు చుట్టి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సూపర్‌ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాక ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు. ఈరోజు నుండి 5 రోజులపాటు ప్రజాగళం కార్యక్రమం చేపట్టనున్నారు. ఈరోజు (ఏప్రిల్ 3) కొత్తపేట, రామచంద్రాపురం, 4వ తేదీన కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించనున్నారు. 5వ తేదీన నరసాపురం, పాలకొల్లు, 6వ తేదీన పెదకూరపాడు, సత్తెనపల్లి, 7వ తేదీన పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమం నిర్వహించనున్నారు. రోజూ సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6 గంటలకు రెండో సమావేశం జరిపేలా ప్రణాళిక రూపొందించారు. తొలి విడత 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్‌షోలలో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రన్న కోసం మండుటెండను సైతం లెక్క చేయకుండా టీడీపీ శ్రేణులు , ప్రజలు పోటెత్తారు. మీరే రావాలి..మీరు వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి అంటూ వారంతా నినాదాలు చేస్తూ..బాబు లో ఉత్సాహం నింపారు.

ఇక ప్రజా గళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ..సీఎం జగన్‌ నమ్మించి గొంతు కోసే రకమని ధ్వజమెత్తారు. బాబాయ్‌ని చంపించిన వారికి ఎంపీ సీటు కట్టబెట్టి, బాధితులనే ఇబ్బంది పెడుతున్న సీఎం ఫేక్‌ ఫెలో అంటూ దుయ్యబట్టారు. ఐదేళ్లు కేంద్రంలో అన్ని బిల్లులకూ వైసీపీ సహకరించిందన్న చంద్రబాబు ఎన్టీయే అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయంటూ రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక రాష్ట్రం కోసమే తప్ప, స్వలాభం కోసం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికెళ్లడం ఖాయమన్న చంద్రబాబు కూటమిది ఏకపక్ష విజయమని ధీమా వ్యక్తం చేశారు.

Read Also : Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్

  Last Updated: 03 Apr 2024, 09:29 AM IST