Site icon HashtagU Telugu

Praja Galam Utter Flop : మైక్ ఫెయిల్.. ప్రజాగళం ఫెయిల్ అంటూ వైసీపీ సెటైర్లు

Prajagalam Utter Flop

Prajagalam Utter Flop

చిలకలూరిపేటలో ఎన్డీయే కూటమి ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో భారీ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రధాని మోడీ (Modi) ముఖ్య అతిధిగా హాజరు కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) లతో పాటు మూడు పార్టీలకు సంబదించిన నేతలు , పార్టీకార్యకర్తలు , అభిమానులు ఇలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా ఈ సభపై అధికార పార్టీ వైసీపీ సెటైర్లు వేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా సభలో మోడీ మాట్లాడుతుండగా పదే పదే మైక్ పనిచేయకపోవడం కాస్త ఇబ్బందిగా మారింది. ప్రధాని సైతం కాస్త అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటన పట్ల వైసీపీ సెటైర్లు వేయడం స్టార్ట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ‘మైక్ ఫెయిల్.. మీటింగ్ ఫెయిల్.. టోటల్ గా ముగ్గురూ ఫెయిల్’ అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. సభకు జనం రాకపోవడంతో సభా ప్రాంగణం అంతా వెలవెల బోయిందని, పవన్, చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో అయితే సభలో ఖాళీ కుర్చీలు కనిపించాయని… కుర్చీలు కూడా నిండకపోవడంతో… స్టేజీ దగ్గర కార్యకర్తలతో టీడీపీ హడావిడీ చేయించిందని వైసీపీ సోషల్ మీడియా లో ప్రచారం మొదలుపెట్టింది. పవన్ కల్యాణ్, చంద్రబాబు లు మాట్లాడుతుంటే మైక్ బాగానే పని చేసింది. కానీ ప్రధాని మోదీ మాట్లాడుతుంటే మాత్రం మైక్ నాలుగు సార్లు కట్ అయింది. అసలు ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే..మైక్ కట్ అవ్వడం అనేది ఎంత నిర్లక్ష్య లోపం అంటూ వైసీపీ విమర్శలు చేస్తుంది.

Read Also : Modi Stopped The Pawan Speech : పవన్ కళ్యాణ్ స్పీచ్ కు మోడీ అడ్డు..అసలు ఏంజరిగిందంటే..!!