Site icon HashtagU Telugu

Praja Galam : ‘ప్రజాగళం’ కు పోటెత్తిన ప్రజలు

Prajagalamtdp

Prajagalamtdp

ఏపీ(AP)లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది..మే 13 న ఎన్నికలు జరగనున్నాయి..అంటే ఇంకా 60 రోజుల సమయం కూడా లేదు..దీంతో అన్ని పార్టీలు తమ జోరును పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో పొత్తుతో ఎన్నికల బరిలో దిగబోతున్న టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి ఈరోజు తమ మొదటి భారీ బహిరంగ సభ లో పాల్గొనబోతుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) నియోజకవర్గం బొప్పూడి వద్ద ఏర్పటు చేసిన ‘ప్రజాగళం’ (Praja Galam) సభలో ప్రధాని మోడీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో పాటు మూడు పార్టీల నేతలు , కార్యకర్తలు , అభిమానులు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే సభ ప్రాంగణం మొత్తం పార్టీల శ్రేణులతో నిండిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి మూడు పార్టీల శ్రేణులు, ప్రజలు ఉత్సాహంగా తరలి వచ్చారు. పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభను కనీవిని ఎరుగని రీతిలో అత్యంత భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

 

పదేళ్ల తర్వాత తొలిసారిగా మోడీ (Modi) , చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు ఒకే వేదికపైకి రానున్నారు. 2014లో ఈ ముగ్గురు చేయి కలిపి ఏపీలో విజయం సాధించడం తెలిసిందే. 2019లో కూటమి విడిపోయింది. ఇప్పుడు పరిస్థితులు ఈ మూడు పార్టీలను మళ్లీ కలిపాయి. ప్రజాగళం సభతో మూడు పార్టీల కూటమి ఎన్నికల యుద్ధభేరి మోగించనుంది. కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. సాయంత్రం ప్రధాని మోదీ 4.10 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ్నించి హెలికాప్టర్ లో బయలుదేరి బొప్పూడి చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి సాయంత్రం 5.20 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ప్రజాగళం సభకు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఎన్ఎస్ జీ సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు.

 

Read Also : Kalki 2898AD: ఎన్నికల కారణంగా ప్రభాస్ మూవీ వాయిదా పడనుందా.. ఫాన్స్ కి నిరాశ తప్పదా?