Prabhas: దటీజ్ ప్రభాస్.. వరద బాధితులకు కోటి విరాళం!

ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయి. వరదలు సంభవించి అనేక మందిని ఇబ్బందులకు గురి చేసింది. చాలా మంది నటీనటులు ముందుకు వచ్చి వరద సహాయం కోసం భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.

  • Written By:
  • Updated On - December 8, 2021 / 01:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయి. వరదలు సంభవించి అనేక మందిని ఇబ్బందులకు గురి చేసింది. చాలా మంది నటీనటులు ముందుకు వచ్చి వరద సహాయం కోసం భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. రాధే శ్యామ్ నటుడు ప్రభాస్ భారీ మొత్తంలో సాయం చేయడానికి ముందుకొచ్చాడు. వరదలో నష్టపోయినవారిని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చాడు.

ప్రభాస్ త్వరలో రాబోయే చిత్రం రాధే శ్యామ్‌లో పూజా హెగ్డేతో రొమాన్స్ చేయనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14, 2022న థియేటర్లలోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా చితికిపోయిన ప్రజలను ఆదుకునేందుకు బాహుబలి స్టార్ రూ. 1 కోటి విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. అనేక వేల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ఇంతకుముందు, హైదరాబాద్‌లో వినాశకరమైన వర్షాలు, ఏప్రిల్ 2020 లో లాక్‌డౌన్‌ల సమయంలో, నటుడు రూ. 4.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. బాధితుల సహాయార్థం చిరంజీవి, రామ్ చరణ్ ఒక్కొక్కరు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయానికి 25 లక్షల రూపాయల విరాళం అందించారు. వరదల వల్ల జరిగిన విధ్వంసం చూసి బాధపడ్డానని చిరంజీవి అన్నారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో వరదలు, కుండపోత వర్షాల కారణంగా జరిగిన విధ్వంసానికి సహాయ కార్యక్రమాలకు సహాయం చేయడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలను వినయపూర్వకంగా విరాళంగా ఇస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.