Powerless Pawan : హీరోయిన్ల ముందు ప‌వ‌న్ దిగ‌తుడుపే!కొడాలి ఛాలెంజ్!

హీరోయిన్లు న‌వ‌నీత్ కౌర్, సుమ‌ల‌తల‌తో జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను(Powerless Pawan) వైసీపీ పోల్చుతోంది.

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 02:15 PM IST

హీరోయిన్లు న‌వ‌నీత్ కౌర్, సుమ‌ల‌తల‌తో జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను(Powerless Pawan) వైసీపీ పోల్చుతోంది. ఆకాశంలో ఉన్న‌న్ని స్టార్ల‌ను పెట్టుకుని ప‌వ‌ర్ స్టార్ అంటూ పిలుపించుకోవ‌డం కాదు, స్వ‌తంత్ర్యంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెల‌వాల‌ని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి స‌వాల్ విసిరారు. మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి ఎంపీ న‌వనీత్ కౌర్. ఆమె గ‌త ఎన్నిక‌ల్లో స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అలాగే, క‌ర్ణాట‌క‌లోని మాండ్యా లోక్ స‌భ నుంచి ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా సుమ‌ల‌త పోటీ చేసి విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు హీరోయిన్లు లోక్ స‌భ‌లో ఉన్నారు. వాళ్ల మాదిరిగా స్వ‌తంత్ర్య అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలుపొందాల‌ని ప‌వ‌న్ కు సరికొత్త ఛాలెంజ్ వైసీపీ విసిరింది.

హీరోయిన్లు న‌వ‌నీత్ కౌర్, సుమ‌ల‌తల‌తో జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను(Powerless Pawan)

వారాహి యాత్ర కొన‌సాగిస్తోన్న ప‌వ‌న్ (Powerless Pawan) ఒక్కసారి అసెంబ్లీకి పంపివ్వండి ప్లీజ్ అంటూ ప్రాధేయ‌ప‌డుతున్నారు. ఆ విష‌యాన్ని గుర్తు చేస్తూ అసెంబ్లీలోకి అడుగు పెట్ట‌డానికి పొత్తు కోసం ప‌వ‌న్ వెంప‌ర్లాడుతున్నార‌ని వైసీపీ చెబుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 10 పార్టీల‌తో పొత్తు పెట్టుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్ట‌లేక‌పోయిన ప‌వ‌న్ ఈసారి చంద్ర‌బాబును న‌మ్ముకున్నాడ‌ని విమ‌ర్శిస్తోంది. సీఎంగా చేయండని అడిగే ద‌మ్ము లేని ప‌వర్ స్టార్ ప‌వ‌న్ పేరు వెనుక మాత్రం ఆకాశంలోని స్టార్ల‌న్ని పెట్టుకుంటాడ‌ని వ్యంగ్యాస్త్రాల‌ను కొడాలి నాని విసిరారు. గుడివాడ కేంద్రంగా శుక్ర‌వారం జ‌రిగిన టిడ్కో ఇళ్ల ప్రారంభోత్స‌వం స‌భ జ‌రిగింది. దానికి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jaganmohan Reddy) ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ మీద కొడాలి విరుచుకుపడ్డారు.

ప్ర‌శ్నించ‌డానికి మాత్ర‌మే పార్టీని పెట్టాన‌ని  ప‌వ‌న్

సాధార‌ణంగా ఎవరైనా రాజ్యాధికారం కోసం పార్టీ పెడ‌తారు. కానీ, ప్ర‌శ్నించ‌డానికి మాత్ర‌మే పార్టీని పెట్టాన‌ని  ప‌వ‌న్ (Powerless Pawan) ప‌లుమార్లు చెప్పారు. క‌నీసం 30 ఏళ్లు పార్టీని న‌డుపుతానంటూ చెబుతూ విలీనం ప్ర‌స‌క్తేలేద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌ర‌ణ ఇస్తున్నారు. గెల‌వ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ ఎవ‌ర్నైనా ఓడించ‌డానికి జ‌న‌సేన ప‌నికొస్తుంద‌ని ప‌వ‌న్ ప‌లుమార్లు చెప్పారు. ప‌దేళ్ల క్రితం పార్టీ పెట్టిన ఆయ‌న వైసీపీతో మిన‌హా రాష్ట్రంలోని పార్టీల‌న్నింటితో ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తు పెట్టుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌క ప‌ది పార్టీల‌తో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ జ‌న‌సేన‌కు గుర్తింపు లేదు. రిజిస్ట్ర‌ర్ పార్టీగా మాత్ర‌మే ఉంది. అందుకే, రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం పొంద‌కుండా ఉండాలంటే టీడీపీతో పొత్తు అవ‌స‌ర‌మ‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే టీడీపీ మ‌ద్ధ‌తు అనివార్యంగా ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. ఆ విష‌యాన్ని క్యాడ‌ర్ కు విడ‌మ‌ర‌చి చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ ప‌రోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.

కులం పునాదుల మీద పార్టీలు నిల‌బ‌డ‌వంటూ

రెండు రోజులు క్రితం క‌త్తిపూడి వ‌ద్ద ప్రారంభించిన వారాహి యాత్ర ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన‌సాగుతోంది. ప‌ది రోజుల పాటు ఆ యాత్ర‌ను షెడ్యూల్ చేశారు ఎండ‌వేడిమిలేని స‌మ‌యం చూసుకుని మీటింగ్ లు పెడుతున్నారు. ఆ సంద‌ర్భంగా ఒక్క‌సారి అసెంబ్లీకి పంపండి..ప్లీజ్ అంటూ వంగివంగి దండం పెట్ట‌డాన్ని వైసీపీ సెటైరిక్ గా తీసుకుంది. కేవలం ఎమ్మెల్యే కావ‌డానికి పార్టీ పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని నిల‌దీస్తోంది. హీరోయిన్లు సుమ‌ల‌త‌, న‌వ‌నీత్ కౌర్ మాదిరిగా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెల‌వ‌చ్చు అంటూ వ్యంగ్యాస్త్రాల‌ను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) విస‌ర‌డం గ‌మ‌నార్హం.

కాపులంద‌రూ ఓటేసినా గెస్తానంటూ ప‌వ‌న్ (Powerless Pawan)

గ‌త వారం రోజులుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ(Powerless Pawan) మీద వైసీపీ విరుచుకుప‌డుతోంది. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేస్తూ కులం పునాదుల మీద పార్టీలు నిల‌బ‌డ‌వంటూ విమ‌ర్శించారు. కులాల ప్ర‌స్తావ‌న లేకుండా రాజ‌కీయాలు అంటూ కాపు రిజర్వేష‌న్ల కోసం డిమాండ్ చేయ‌డం ప‌వ‌న్ రాజ‌కీయ అమాయ‌క‌త్వాన్ని నిరూపిస్తోంది. కాపులంద‌రూ ఓటేసినా గెస్తానంటూ ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశారు. అంటే, కాపు పార్టీగా జ‌న‌సేన ను మార్చేసేలా ఆయ‌న మాట్లాడం విచిత్రం.

Also Read : Pawan Kalyan: వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతుందా..? ప‌వ‌న్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం..

ఇక పొత్తు గురించి అస్ప‌ష్టంగా ఒక‌సారి, స్ప‌ష్టంగా ఒక‌సారి  ప‌వ‌న్ క‌ల్యాణ్  చెబుతుంటారు. ప్ర‌భుత్వం వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీలికుండా చూస్తానంటూ ఒక‌సారి, ఒంటరిగా వెళ‌తానంటూ మ‌రోసారి చెబుతూ క్యాడ‌ర్ ను తిక‌మ‌క చేస్తున్నారు. అందుకే, ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద అవ‌కాశం ఉన్న‌ప్పుడల్లా వైసీపీ లీడ‌ర్లు వ్యంగ్యాస్త్రాల‌ను విసురుతున్నారు. రెండు చెప్పులూ చూపిస్తూ గురువారం మాజీ మంత్రి పేర్ని నాని వార్నింగ్ ఇవ్వ‌గా శుక్ర‌వారం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రాబోవు ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ అసెంబ్లీలోకి అడుగుపెట్ట‌కుండా ప్ర‌జ‌లు అడ్డుకుంటార‌ని జోస్యం చెప్ప‌డం కొస‌మెరుపు.

Also Read : Janasena varaahi : ప‌వ‌న్ `ముంద‌స్తు` మాట! ఏపీ, తెలంగాణ ఎన్నిక‌లు ఒకేసారి..?