జనసేనాని పవన్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోంది. వలంటీర్లపై ఆయన చేసిన కామెంట్లు లా అండ్ ఆర్డర్ ను (Power War)ప్రశ్నించేలా ఉన్నాయి. మహిళ అక్రమ రవాణా చేస్తున్నారని కొందరు వలంటీర్ల గురించి మాత్రమే అన్నానని వివరణ ఇచ్చే ప్రయత్నం పవన్ చేశారు. కానీ, ఆయన వ్యాఖ్యలు రేపిన రాజకీయ వేడి చల్లారలేదు. ఫైర్ బ్రాండ్ , మంత్రి రోజా మీడియా ముందుకొచ్చారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్ చేసిన కామెంట్ల మీద విరుచుపడ్డారు. `పిచ్చోడా..పిచ్చి మాటలు మాట్లాడకు..` అంటూ వలంటీర్ల వ్యవస్థ గొప్పతనం గురించి చెబుతూ చీపురుతీసుకొని కొడతారంటూ వార్నింగ్ ఇచ్చారు.
లా అండ్ ఆర్డర్ ను ప్రశ్నించేలా(Power War)
సంస్కరం లేకుండా పెంచిన పవన్ తల్లిని కూడా మంత్రి రోజా రాజకీయ వివాదాల్లోకి లాగారు. ఒక వైపు లెంపలు వేసుకుంటూనే పవన్ కారణంగా ఆయన తల్లికి చెడ్డపేరు వస్తుందని ముక్తాయించారు. గత రెండు రోజులుగా పవన్ మీద వలంటీర్లు పలు చోట్ల కేసులు పెట్టారు. దిష్టిబొమ్మలను (Power War) తగులబెట్టారు. పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మిస్సింగ్ కు, హ్యూమన్ ట్రాఫికింగ్ కు తేడా తెలియకుండా మాట్లాడిన పవన్ మీద సామాజిక కార్యకర్తలు సైతం చర్చించుకుంటున్నారు. టాప్ టెన్ లో ఉన్న రాష్ట్రాల గురించి పవన్ ఎందుకు ప్రశ్నించరని నిలదీస్తున్నారు. మహిళల మిస్సింగ్ కేసుల్లో టాప్ 6లో ఉన్న తెలంగాణ గురించి మాట్లాడే ధైర్యం పవన్ కు ఉందా అంటూ రోజా నిలదీయడం జనసైనికులకు సైతం ఔరా అనిపించేలా ఉంది.
మహిళల మిస్సింగ్ కేసుల్లో టాప్ 6లో ఉన్న తెలంగాణ
తెలంగాణ పరిపాలన గురించి మాట్లాడితే పవన్ మక్కెలు ఇరగకొడతారని రోజా చురకలు వేశారు. నోటి ఏది బడితే, అది మాట్లాడితే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. అంతేకాదు, లా అండ్ ఆర్డర్ ను (Power War) దెబ్బతీసేలా యువతను రెచ్చగొడుతున్న పవన్ గురించి చెడుగుడు ఆడుతూ ఆమె మాట్లాడారు. ఆమెతో పాటు మంత్రులు వరుసగా మీడియా ముందుకొచ్చి పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మరో వైపు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దానికి పవన్ ఇచ్చే సమాధానం ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read : Janasena fever : డిప్రషన్లో పవన్ ? సోషల్ మీడియాలో YCP దుమారం!!
రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో పవన్ మీద. వలంటీర్లు కేసులు నమోదు చేశారు. వాటి ఆధారంగా పవన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సర్వత్రా వినిపిస్తోంది. ఒక వైపు వైసీపీ, జనసేన మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతోంది. పెళ్లిళ్లు, కాపురాలు, సెటప్ ల గురించి పరస్పరం పోస్టులు పెట్టుకుంటున్నారు. ఏపీ రాజకీయాన్ని బూతుగా మార్చేశారు. అక్కడి మహిళల్ని వ్యభిచారం వృత్తిలోకి పంపేస్తున్నట్టు క్రియేట్ చేశారు. ఏపీ సమాజాన్ని అగౌరవపరిచేలా రాజకీయం సాగుతోంది. ఆ రెండు పార్టీల మధ్య. జరుగుతోన్న అసాంఘిక రాజకీయపోరాటంలో చంద్రబాబును కూడా లాగేస్తున్నారు. మహిళ మిస్సింగ్ , హ్యూమన్ ట్రాఫికింగ్ (Power War) గురించి చర్చకు సిద్దమని పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఆ క్రమంలో పవన్ అరెస్ట్ తథ్యమని చెబుతున్నారు. ఆ ధైర్యం జగన్మోహన్. రెడ్డి సర్కార్ చేస్తుందా? అనేది చూడాలి.
Also Read : Janasena Mega plan :`సుఫారీ` సుడులు! పవన్ `హత్యకు కుట్ర నిజమా?