Power Sure to TDP : వ‌చ్చే ఎన్నిక‌ల్లో YCP తిరుగులేని ఓట‌మి! లాజిక్ ఇదే..!

Power Sure to TDP : రాబోవు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుంది. దానికి ఒక సింపుల్ లెక్క‌ను టీడీపీ సానుభూతిప‌రులు వేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 03:56 PM IST

Power Sure to TDP : రాబోవు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుంది. దానికి ఒక సింపుల్ లెక్క‌ను టీడీపీ సానుభూతిప‌రులు వేస్తున్నారు. జ‌స్ట్ 21 సీట్ల‌ను అద‌నంగా పొంద‌గ‌లిగితే చాలు, 2024 ఎన్నిక‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ట్టేన‌ని అంచ‌నా వేస్తున్నారు. అదెలా అంటే ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారం లోకి రావాలి అంటే కనీసం అందులో సగం కంటే 88 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకుంటే చాలు. ఆ సంఖ్య‌ను ఈజీగా చేరుకోవ‌డానికి అవ‌కాశం ఉంద‌ని తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన పొత్తు నిద‌ర్శ‌నం. ఎందుకంటే, గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలను తీసుకుంటే పొత్తు ఈసారి టీడీపీని అధికారంలోకి తీసుకునుంది.

 పొత్తు ఈసారి టీడీపీని అధికారంలో..(Power Sure to TDP)

గ‌త ఎన్నిక‌ల్లో (2019లో) టిడిపి గెలుపొంద‌ని ఎమ్మెల్యేలు కేవ‌లం 23. అలాగే, జనసేన ఒక ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే గెలుచుకుంది. ఆ రెండు పార్టీలు క‌లిసి గెలుచుకున్న ఎమ్మెల్యేల సంఖ్య 24. అలాగే, టీడీపీ ప్ల‌స్ జ‌న‌సేన పార్టీల‌కు ల‌భించిన ఓట్లు 43 స్థానాల్లో వైసీపీ కంటే ఎక్కువ‌గా ఉన్నాయి. అక్క‌డ ఓడిపోయిన‌ప్ప‌టికీ ఓటు బ్యాంకు ఫ్యాన్ పార్టీ కంటే ఆ రెండు పార్టీలకు ఎక్కువ వ‌చ్చాయి. అంటే, గ‌త ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు గెలిచిన స్థానాల సంఖ్యను 24 ప్ల‌స్ 43 అంటే 67 మంది ఎమ్మెల్యేలుగా అంచ‌నా. కేవ‌లం వేర్వేరుగా పోటీచేసిన కార‌ణంగా ఆ 43 స్థానాల్లో వైసీపీ గెలుచుకోగ‌లిగింది. లేదంటే, టీడీపీకి వ‌చ్చేవ‌ని ( Power Sure to TDP)అంచ‌నా వేస్తున్నారు.

ప్రపంచం తలంకిందు అయినా వైసీపీ ఓట‌మి ఖాయం 

అత్యంత ఘోర‌మైన ఓట‌మి చెందిన‌ 2019 ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌మాణికంగా తీసుకున్నా TDP-23 + JSP-1+43 =67ఈ 67 ఎమ్మెల్యే సీట్ల‌ను క‌లిసి పోటీ చేసి ఉంటే గెలిచేవి. అంటే, ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు వేవ్ పెద్ద‌గా లేదు. కేవ‌లం ఓట్ల చీలిక కార‌ణంగా ఆయ‌న 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకోగ‌లిగారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు, పాల‌న‌మీద అవ‌గాహ‌నా రాహిత్యం వెర‌సి గ‌తం కంటే ఖచ్చింతంగా వైసీపీ ఓట్ల‌ను కోల్పోతుంది.

మ్యాజిక్ ఫిగ‌ర్ 88 స్థానాలకుగాను, ప‌వ‌న్ ప్ర‌క‌టించిన పొత్తుతో 67 చోట్ల గెలుపు ఖాయం అయింది. అంటే,( 88-67=21) కేవ‌లం ఇంకా 21 స్థానాల్లో రెండు పార్టీలు గెలుచుకుంటే చాలు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీల పొత్తు బాగా క‌లిసొస్తుంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద ఉన్న వ్య‌తిరేక‌త అధికారాన్ని స‌మీపంలోనే చూపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల కంటే అద‌నంగా 21 స్థానాల్లో గెలుచుకోవ‌డం టీడీపీ, జ‌న‌సేన‌కు క‌ష్టం ఏమీ కాదు. ఎందుకంటే, ఇప్ప‌టికే నెల్లూరు జిల్లాలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో ( Power Sure to TDP) చేరారు.

Also Read : Jagan Bail anniversary : న్యాయ‌దేవ‌త‌కు గంత‌లు! జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ కు ప‌దేళ్లు..!!

ఇక అమ‌రావ‌తి రాజ‌ధాని స‌మీపంలోని కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల్లో మొత్తం 43 స్థానాలు ఉన్నాయి. వాటిని స్వీప్ చేయ‌డం ఈసారి ఖాయ‌మంటూ టీడీపీ, జ‌న‌సేన అంచ‌నా వేస్తోంది. ఆ మూడు జిల్లాల లో(గుంటూరు-17, కృష్ణ-15, ప్రకాశం-11) కలిపి మొత్తం 17+15+11=43 ఎమ్మెల్యే స్థానాలు. అక్క‌డి ప్ర‌జ‌లు అమరావతి పోవటం తో బాధపడి,ఆస్తుల విలువ తగ్గిపోయి, రివెంజ్ కోసం సైలెంట్ గా చూస్తున్నార‌ని జ‌గ‌న్ అండ్ బ్యాచ్ కు తెలియ‌డంలేదు.అలాగే వైజాగ్ ప్రజలు కూడా అక్క‌డి కబ్జాలు, రౌడీయిజం, రిషికొండకి గుండు కొట్టడం త‌దిత‌రాల‌తో విసిగిపోయారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి ప్రజలు కూడా తిరుమల లో మ‌త‌మార్పిడులు, ఏసుబోధ‌న‌లు ద్వారా అక్రమాలు చూసి విసిగి పోయారట‌. ఉద్యోగులు ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం మీద మండిప‌డుతున్నారు. పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఉద్యోగం కోసం ఎదురుచూసే యువత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ చేసిన మోసాన్ని త‌ట్టుకోలేక ర‌గిలిపోతున్నారు.

Also Read : CBN Wife Letter : భువ‌నేశ్వ‌రి పేరుతో లేఖ వైర‌ల్

ఇసుక ధ‌ర‌లు బంగారంలా పెంచేశారు. మ‌ద్య‌నిషేధం దేవుడెరుగు ధ‌ర‌ల‌ను పెంచారు. కరెంట్ బిల్లు లు 4 రెట్లు పెంచ‌డం పేద‌ల‌కు భారంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల భూ భాగోతాలు, అక్ర‌మాలు, క‌క్ష్య సాధింపులు, అరాచ‌కాలు వెర‌సి 2024 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అధికారం కంటిచూపు మేర క‌నిపించ‌డంలేదు. ఆ మేర‌కు ప్రశాంత్ కిషోర్ కూడా నివేదిక ఇచ్చార‌ట‌. అందుకే, ఇగోను తీర్చుకోవ‌డానికి చంద్ర‌బాబును జైలుకు పంప‌డం ద్వారా తృప్తి చెందుతున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని కొంద‌రి టాక్‌. సో , 2024 లో ప్రపంచం తలంకిందు అయినా కూడా వైసీపీ ఓట‌మి ఖాయంగా క‌నిపిస్తుంద‌ని గ‌త ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల‌కు వ‌చ్చిన ఓట్ల ఆధారంగా విప‌క్షం వేస్తోన్న అంచ‌నా.