Site icon HashtagU Telugu

Power Issue in AP : విద్యుత్ ఉద్యోగుల‌ నిర్బంధం

Ap Hikes Power Tariff

Ap Hikes Power Tariff

అనంత‌పురం జిల్లా పి.సిద్ధరాంపురంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్‌స్టేషన్‌కు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన‌ప్ప‌టికీ రైతుల ఆగ్ర‌హం త‌గ్గ‌లేదు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. క‌రెంట్ కోతలతో అల్లాడిపోతున్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పంట‌లు నిలువునా ఎండిపోతుండ‌డంతో రైతులు ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. పి.సిద్ధరాంపురం, కూడేరు మండలం ఎం.ఎం.పల్లిలో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రోజూ ఆరు గంటలు కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా మండలాల రైతులు విద్యుత్ ఉద్యోగుల‌ను వెంట‌బ‌డి నిర్బంధిస్తున్నారు.