Site icon HashtagU Telugu

Janasena : పవన్ ర్యాలీకి పవర్ కట్..అభిమానుల సెల్ ఫోన్ల లైటింగ్ తోనే…!!!

Pawan

Pawan

విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ర్యాలీలో ఉద్రికత్త చోటుచేసుకుంది. పవన్ యాత్రలో పవర్ లేకుండా పోయింది. దీంతో లైటింగ్ ఉన్న మీడియా వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు. పవన్ కాన్వాయ్ కి కూడా లైటింగ్స్ లేవు. దీంతో లా అండ్ ఆర్డర్ డీసీపీ సుమిత్ రంగంలోకి దిగారు. పవన్ ర్యాలీతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం చీకటిపడే సమాయానికి విశాఖ చేరుకున్న పవన్…బీచ్ రోడ్డులోని నోవాటెల్ కు ర్యాలీగా వెళ్లారు. అయిన వెళ్లే మార్గంలో కూడా స్ట్రీట్ లైట్స్ వెలగలేదు. అయినాకూడా పవన్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. అభిమానులు సెల్ ఫోన్ల లైట్స్ తో ముందుకు సాగుతున్నారు. పవన్ కాన్వాయ్ కి కూడా లైట్స్ లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.