Pothina Mahesh : జనసేనకు పోతిన మహేష్ బై..? బై..?

కన్నీళ్లు పెట్టుకుని ఏం చేయను. పోరాడినా అవకాశం రాలేదు. ఇంకా నా వల్ల కావట్లేదు. ఉదయం ఏసుప్రభుకి నా బాధ చెప్పుకున్నా

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 08:54 PM IST

విజయవాడ వెస్ట్ నుండి జనసేన (Janasena) తరుపున పోటీ చేయాలనీ ఎప్పటి నుండి భావిస్తూ వస్తున్న పోతిన మహేష్ (Pothina Mahesh) కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీరని అన్యాయం చేసాడు. పదేళ్లు గా జనసేన తో నడుస్తూ…పవన్ కల్యాణే మా ప్రాణం అని..చెప్పుకుంటూ , పార్టీ కోసం కష్టపడుతూ వచ్చిన నేతలకు చివరకు పవన్ కళ్యాణ్ చేసింది జీరో. పార్టీ కోసం కష్టపడినా వారికీ నేను ఏంచేయలేను..చంద్రబాబు చెప్పిందే చేయగలను అనే రీతిలో పవన్ కళ్యాణ్ వ్యవహరించారు.

పొత్తు పెట్టుకోవడం వరకు ఓకే కానీ కనీసం పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన కీలక నేతలకు కూడా టికెట్ ఇప్పించలేనప్పుడు పార్టీ నడపడం ఎందుకు…ఏ పార్టీ అధినేత చెప్పినట్లు చేస్తూ వెళ్తున్నాడో..అదే పార్టీ లో చేరిపోతే సరిపోతుంది కదా..ఎందుకు పార్టీ పెట్టి పార్టీ కోసం కష్టపడినా వారికీ టికెట్స్ ఇవ్వలేనప్పుడు అని ఇప్పుడు అంత విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యూహంనాకు వదిలిపెట్టండి..వ్యూహం నాకు వదిలిపెట్టండి అంటే పవన్ ఏంచేస్థాడో అని అంత అనుకున్నారు కానీ చివరకు సొంత పార్టీ నేతలకే టికెట్ ఇప్పించలేకపోయాడని ఎవ్వరు ఊహించలేదు. ఇక టికెట్ రానప్పుడు ఇంకెందుకు పార్టీ కోసం పనిచేయడం ..ఇంకెంతకాలం ఇతర పార్టీల నేతలను గెలిపించుకుంటూ పోవడం అని చెప్పి వరుస పెట్టి నేతలు , పార్టీ శ్రేణులు బయటకు వస్తున్నారు. ఇప్పటీకే ఎంతోమంది పార్టీని వీడగా..మరికొంతమంది సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు పోతిని మహేష్ సైతం పార్టీ ని వీడబోతున్నట్లు అర్ధం అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

మొదటి నుండి విజయవాడ వెస్ట్ సీటుఫై ఎంతో ఆశ పెట్టుకున్నాడు..ప్రజలు సైతం మహేష్ కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు బిజెపికి వెళ్లింది. బిజెపి నుండి సుజనా చౌదరి పోటీ చేస్తున్నాడు. సుజనా పేరు ప్రకటించినప్పటికీ , మహేష్ కోసం పవన్ కూటమి తో చర్చలు జరుపుతారని, మహేష్ పేరే ఖరారు చేస్తారని నమ్మకంతో వచ్చాడు. కానీ పవన్ ఏమిచేయలేడని, బీజేపీ, టీడీపీ ల నిర్ణయాలకు ఓకే చెప్పడమే కానీ మా అభ్యర్థినే పోటీ చేస్తాడని గట్టిగా చెప్పలేకపోయాడని అర్థమైపోయింది. అందుకే ఇక మహేష్ తన ఆశలను వదులుకున్నాడు. కన్నీరు తప్ప తన దగ్గర ఏమిలేదని చెప్పుకొచ్చారు.

‘కన్నీళ్లు పెట్టుకుని ఏం చేయను. పోరాడినా అవకాశం రాలేదు. ఇంకా నా వల్ల కావట్లేదు. ఉదయం ఏసుప్రభుకి నా బాధ చెప్పుకున్నా. అంతకంటే ఏం చేయను. ఎంతని పోరాడను. ప్రతి రోజూ పరీక్ష అంటే ఎలా తట్టుకోగలను’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం మహేష్ కు వైసీపీ నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. అతి త్వరలో జనసేనకు గుడ్ బై చెప్పబోతున్నట్లు అర్ధం అవుతుంది. మహేష్ రాజీనామా చేస్తే..ఇక జనసేన కాదు…కదా అక్కడ కూటమి కూడా గెలవదని అంత అంటున్నారు. ఏది ఏమైనప్పటికి కూటమి లో చేరి పవన్ పెద్ద తప్పు చేసాడనేది స్పష్టంగా అర్ధం అవుతుంది.

Read Also : Chandrababu : టీడీపీది విజన్‌ అయితే జగన్‌ది విషం..!