Site icon HashtagU Telugu

Pothina Mahesh : జనసేన కు భారీ షాక్..పోతిన మహేష్ రాజీనామా

Pothana Mahesh

Pothana Mahesh

మరికొద్ది రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేశ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు పంపించారు.

We’re now on WhatsApp. Click to Join.

విజయవాడ వెస్ట్ నుండి జనసేన (Janasena) తరుపున పోటీ చేయాలనీ ఎప్పటి నుండి భావిస్తూ వస్తున్న పోతిన మహేష్ (Pothina Mahesh) కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీరని అన్యాయం చేసాడు. పదేళ్లు గా జనసేన తో నడుస్తూ…పవన్ కల్యాణే మా ప్రాణం అని..చెప్పుకుంటూ , పార్టీ కోసం కష్టపడుతూ వచ్చిన నేతలకు చివరకు పవన్ కళ్యాణ్ చేసింది జీరో. జగన్ ను ఓడించేందుకు బిజెపి, టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం వరకు ఓకే కానీ కనీసం పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన కీలక నేతలకు కూడా టికెట్ ఇప్పించలేనప్పుడు పార్టీ నడపడం ఎందుకు…? అని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇక టికెట్ రానప్పుడు ఇంకెందుకు పార్టీ కోసం పనిచేయడం ..ఇంకెంతకాలం ఇతర పార్టీల నేతలను గెలిపించుకుంటూ పోవడం అని చెప్పి వరుస పెట్టి నేతలు , పార్టీ శ్రేణులు బయటకు వస్తున్నారు. ఇప్పటీకే ఎంతోమంది పార్టీని వీడగా..మరికొంతమంది సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు పోతిని మహేష్ సైతం పార్టీ ని వీడుతున్నట్లు ప్రకటించారు.

మొదటి నుండి విజయవాడ వెస్ట్ సీటుఫై ఎంతో ఆశ పెట్టుకున్నాడు..ప్రజలు సైతం మహేష్ కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు బిజెపికి వెళ్లింది. బిజెపి నుండి సుజనా చౌదరి పోటీ చేస్తున్నాడు. దీంతో మహేష్ ఇక చేసేది ఏమిలేక..పార్టీలో ఉండలేక..ప్రజల ముందు ముఖం చూపించలేక చివరకు పార్టీకి రాజీనామా చేసారు. మరి మహేష్ తో పవన్ మాట్లాడి, బుజ్జగిస్తారా..? లేక పోతేపోనీ అని లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.

Read Also : Kangana : ‘బీఫ్’ ఆరోపణల పై స్పందించిన బీజేపీ నేత కంగనా రనౌత్