Site icon HashtagU Telugu

Pothina Mahesh : కాపు సామాజికవర్గాన్ని ‘పవన్ కళ్యాణ్’ బలి చేస్తున్నారు – పోతిన మహేష్

Mahesh Pawan

Mahesh Pawan

జనసేన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పోతిన మహేశ్ (Pothina Mahesh)పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై సంచలన ఆరోపణలు చేసారు. పవన్ కళ్యాణ్ ను ఇంతకాలం నమ్మి నట్టేట మునిగామని , ఇన్నాళ్లు పవన్ కల్యాణ్‌తో కలిసి నడిచినందుకు అసహ్యంగా ఉందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని.. తన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ బయటపెడతానని సంచలన ఆరోపణలు చేశారు.

కాపు సామాజికవర్గాన్ని బలి చేస్తున్నారన్న పోతిన మహేష్.. కాపు యువతను మోసం చేయవద్దని సూచించారు. వీరమహిళల పదవీ కాలం పొడిగించిన జనసేన.. మిగతావారి పదవులు ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఏవిధంగా సీట్ ఇస్తారని.. పచ్చనోట్లు పడేస్తే అన్నీ మర్చిపోతారా అని పోతిన మహేష్ ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పార్టీకి పది స్థానాలు కుక్క బిస్కెట్లలా పడేసిందని ఆరోపించారు. రాజధాని ప్రాంత పరిధిలో జనసేన పార్టీని చంపేశారని మహేష్ అన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామనీ.. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఇంకో ఇరవై ఏళ్ళు కొనసాగుతుందో లేదో తెలియని పరిస్థితి ఉందని పోతిన మహేష్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చి మేం ఆస్తులు అమ్ముకున్నాం.. పవన్ కల్యాణ్ మాత్రం ఆస్తులు కొనుకున్నారని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోటీ చేయడానికి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా. పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మక ద్రోహం చేస్తారా? టీడీపీ, జనసేన పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గంలో సర్వే చేసి.. గెలిచే పశ్చిమ నియోజకవర్గం సీటును ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? త్యాగాలకు బీసీలు కావాలా…కమ్మ సామజిక వర్గం పనికి రాదా?” అంటూ పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మహేష్ రాజీనామా తో జనసేన పార్టీ కి ఎంతో నష్టమని అంత భావిస్తున్నారు. అలాగే ఇప్పుడు మహేష్ చేసిన ఆరోపణల ఫై కూడా అంత మాట్లాడుకుంటున్నారు. మరి మహేష్ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు ఏమైనా మాట్లాడతారా లేదా అనేది చూడాలి. మహేష్ టికెట్ విషయంలో జనసేన నేతలు. పార్టీ శ్రేణులు సైతం కాస్త పవన్ కళ్యాణ్ ఫై కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికే టికెట్ ఇవ్వకపోతే ఇంకెందుకు పార్టీ నడపడం అని ప్రశ్నిస్తున్నారు.

Read Also : AP : వైసీపీలో మీము ఉండలేమంటూ టీడీపీ లో చేరుతున్న నేతలు