జనసేన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పోతిన మహేశ్ (Pothina Mahesh) రాజీనామా చేయడం..వైసీపీ లో చేరబోతున్నట్లు ప్రచారం మొదలుకావడంతో కూటమిలో కొత్త టెన్షన్ మొదలైంది. విజయవాడ వెస్ట్ నుండి జనసేన (Janasena) తరుపున పోటీ చేయాలనీ ఎప్పటి నుండి భావిస్తూ వస్తున్న పోతిన మహేష్ (Pothina Mahesh) కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీరని అన్యాయం చేసాడు. పదేళ్లు గా జనసేన తో నడుస్తూ…పవన్ కల్యాణే మా ప్రాణం అని..చెప్పుకుంటూ , పార్టీ కోసం కష్టపడుతూ వచ్చిన నేతలకు చివరకు పవన్ కళ్యాణ్ చేసింది జీరో. జగన్ ను ఓడించేందుకు బిజెపి, టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం వరకు ఓకే కానీ కనీసం పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన కీలక నేతలకు కూడా టికెట్ ఇప్పించలేనప్పుడు పార్టీ నడపడం ఎందుకు…? అని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తూ వస్తున్నారు.
ఇక టికెట్ రానప్పుడు ఇంకెందుకు పార్టీ కోసం పనిచేయడం ..ఇంకెంతకాలం ఇతర పార్టీల నేతలను గెలిపించుకుంటూ పోవడం అని చెప్పి వరుస పెట్టి నేతలు , పార్టీ శ్రేణులు బయటకు వస్తున్నారు. ఇప్పటీకే ఎంతోమంది పార్టీని వీడగా..మరికొంతమంది సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు పోతిని మహేష్ సైతం పార్టీకి రాజీనామా చేసారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ను ఇంతకాలం నమ్మి నట్టేట మునిగామని , ఇన్నాళ్లు పవన్ కల్యాణ్‌తో కలిసి నడిచినందుకు అసహ్యంగా ఉందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని.. తన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ బయటపెడతానని సంచలన ఆరోపణలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కాపు సామాజికవర్గాన్ని బలి చేస్తున్నారన్న పోతిన మహేష్.. కాపు యువతను మోసం చేయవద్దని సూచించారు. వీరమహిళల పదవీ కాలం పొడిగించిన జనసేన.. మిగతావారి పదవులు ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఏవిధంగా సీట్ ఇస్తారని.. పచ్చనోట్లు పడేస్తే అన్నీ మర్చిపోతారా అని పోతిన మహేష్ ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పార్టీకి పది స్థానాలు కుక్క బిస్కెట్లలా పడేసిందని ఆరోపించారు. రాజధాని ప్రాంత పరిధిలో జనసేన పార్టీని చంపేశారని మహేష్ అన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామనీ.. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఇంకో ఇరవై ఏళ్ళు కొనసాగుతుందో లేదో తెలియని పరిస్థితి ఉందని పోతిన మహేష్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చి మేం ఆస్తులు అమ్ముకున్నాం.. పవన్ కల్యాణ్ మాత్రం ఆస్తులు కొనుకున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం మహేష్ వైసీపీ వైపు అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తుంది. తనకు టికెట్ రాకపోవడం తో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని అంత భావించారు. కానీ రాజీనామా తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలతో. వైసీపీలో ఆయన చేరే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని.. ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు వినికిడి. సీఎం జగన్ నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడలో అడుగుపెట్టిన తర్వాత.. ఆయన సమక్షంలో వైసీపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే పోతిన మహేష్ రాజీనామాతో కూటమికి కొత్త టెన్షన్ మొదలైంది. విజయవాడలో బలమైన బీసీ నేతగా పోతిన మహేష్ ఉన్నారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకు.. 22 వేల 367 ఓట్లు పడ్డాయి. విజయవాడలో పశ్చిమలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. మైనారిటీలు కూడా భారీగా ఉన్నారు. బీసీల మద్దతుతో పాటు మైనారిటీలు మద్దతు సైతం మొదటి నుండి మహేష్ ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ రాజీనామా చేయడం తో ఆ ఓట్లు అవతలి పార్టీకి పడే ఛాన్స్ ఉందని కూటమి ఖంగారుపడుతుంది. మరి మహేష్ తో కూటమి నేతలు మాట్లాడతారా..? లేదా వదిలేస్తారా..? అనేది ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Samsung : శాంసంగ్ ఎమ్ సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఫీచర్స్.. అదుర్స్..!