Pothina Mahesh : జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 10:32 AM IST

Pothina Mahesh: పోతిన మహేశ్ రెండు రోజుల క్రితం జనసేన(Janasena) పార్టీకి రాజీనామా(resignation) చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన కాసేపటి క్రితమే సీఎం జగన్ సమక్షంలో వైసీపీ(YCP)తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.

We’re now on WhatsApp. Click to Join.

విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో, తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. ఈ విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ నచ్చచెప్పినా పోతిన వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ కు ఇటివల తన రాజీనామా లేఖను పంపించారు. దీనిపై పోతిన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ టికెట్ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయానని చెప్పారు. టికెట్ రాదని తేలిపోవడంతో జనసేనలో కొనసాగడంలో అర్థంలేదని భావించి రాజీనామా చేసినట్లు తెలిపారు.

Read Also: Kush Drug : శ్మశానాల దగ్గర హై అలర్ట్.. కుష్ డ్రగ్స్ కలకలం !

జనసేనానని పవన్ కల్యాణ్ పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకం అని… భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని ఆయన అన్నారు. పవన్ కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడం తప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసని… తాను ఆయన వైపు అడుగులు వేస్తానని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు జనసేనలో చేరారు.