BC Declaration : టీడీపీ-జనసేన ‘బీసీ డిక్లరేషన్’ తో వైసీపీలో భయం పట్టుకుంది – పోతిన మహేష్​

మంగళగిరి వేదికగా జయహో బీసీ పేరుతో సభ ఏర్పటు చేసి బీసీ డిక్లరేషన్‌ (BC Declaration) ను టీడీపీ – జనసేన కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, రాబోయే రోజుల్లో పింఛను రూ.4 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చినట్లు తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక జయహో […]

Published By: HashtagU Telugu Desk
Mahesh Ycp

Mahesh Ycp

మంగళగిరి వేదికగా జయహో బీసీ పేరుతో సభ ఏర్పటు చేసి బీసీ డిక్లరేషన్‌ (BC Declaration) ను టీడీపీ – జనసేన కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, రాబోయే రోజుల్లో పింఛను రూ.4 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చినట్లు తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు.

ఇక జయహో బీసీ డిక్లరేషన్ సభ విజయవంతం కావటంపై వైసీపీ నేతలకు భయం పట్టుకుందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ (Pothina Venkata Mahesh) అన్నారు. సామాజిక న్యాయం పేరుతో అందరినీ సామాజికంగా మోసం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలు చేయటానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని మహేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ తగ్గించి సవతి తల్లి ప్రేమ చూపించని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్లో పోతిన మహేష్ దంపతులు ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి రాబోయేది జనసేన- టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్‌ నా బీసీలు అని మాట్లాడటానికి ఆయనకు ఏం అర్హత ఉందని పోతిన మహేష్​ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని బీసీలంతా టీడీపీ, జనసేనతోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల పాలనలో బీసీల కోసం ఒక్క పథకమైనా ప్రవేశపెట్టిందా? అని ఆయన ప్రశ్నించారు. జగన్​ సర్కార్​ బీసీల ఆదరణ, పెళ్లి కానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలను ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ఎంపీ పదవి కోసం ఆర్‌.కృష్ణయ్య బీసీల ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును జగన్‌రెడ్డి వద్ద తాకట్టు పెట్టారని పేర్కొన్నారు.

Read Also : Mamata Banerjee: అంగ‌న్‌వాడీ, ఆశా వ‌ర్క‌ర్ల‌ జీతాలు పెంపు..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

  Last Updated: 06 Mar 2024, 04:41 PM IST