Site icon HashtagU Telugu

Pothina Mahesh : పవన్ ది బ్రాండ్ కాదు – మోసం : పోతిన మహేష్

Pothina Mahesh joined YCP in Jagan's presence

Pothina Mahesh joined YCP in Jagan's presence

విజయవాడ జనసేన వెస్ట్ టికెట్ తనకు కాకుండా బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి కి ఇచ్చారనే కోపంతో జనసేన పార్టీకి రాజీనామా చేసి..వైసీపీ లో చేరిన పోతిన మహేష్ (Pothina Mahesh) ..రోజు రోజుకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై ఘాటైన విమర్శలు చేస్తూ జనసేన శ్రేణుల్లో , అభిమానుల్లో ఆగ్రహం పెంచేస్తున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పుకు తిరిగిన మహేష్..ఈరోజు పవన్ మోసగాడు..ప్యాకేజ్ స్టార్..పవన్ కళ్యాణ్ కు బ్రాండ్ అనేది లేదంటూ వ్యాఖ్యానించడం యావత్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ తిరిగినప్పుడు ఈ మాటలు ఎందుకు అనలేదు..అప్పుడు వైసీపీ ప్యాకేజ్ ఇవ్వలేదా..నీకు అంటూ జనసేన శ్రేణులు మహేష్ కు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా లో మహేష్ ఫై ఘాటైన విమర్శలు చేస్తున్నప్పటికీ ,,మహేష్ మాత్రం తగ్గడం లేదు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పటు చేసి పవన్ కళ్యాణ్ ఫై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు. కాపు యువతకు జనసేనాని అన్యాయం చేస్తున్నారని , జనసైనికులను టీడీపీ జెండా కూలీలుగా మార్చారని, రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాల్లో అసలు జనసేన పార్టీనే లేదంటూ మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కల్యాణ్ దారెటో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. జైలులో చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ ఆస్తులు పెరిగాయని , బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలను త్వరలో బయటపెడతానని పోతిన మహేశ్ హెచ్చరించారు. అసలు పవన్ ది బ్రాండ్ కాదని..మోసమని విమర్శించారు. కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి వసూలు చేసిన చందాలెంతో చెప్పాలని, ఎలక్టోరల్‌ బాండ్స్‌లో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టిందో చెప్పాలంటూ మహేష్ డిమాండ్ చేసారు. అలాగే తిరుమల వెంకటేశ్వరస్వామికి కాకుండా కాజా దగ్గర ఉన్న దశావతారం టెంపుల్‌కే పవన్‌ కల్యాణ్ విరాళాలు ఎందుకు ఇస్తున్నారో బహిర్గతం చేయాలని, పవన్‌ వీరమల్లు సినిమాకు అసలు ప్రొడ్యూసర్‌ ఎవరో చెప్పాలని .. పవన్‌పై దిల్‌రాజు ఐటీ అధికారులకు ఎందుకు కంప్లైట్ చేశారో చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్స్ చేసారు.

Read also : Tendulkar : యువ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాంచీకి టెండూల్కర్