AP Postal Voting : రికార్డు స్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌..ఎవరికీ పడ్డాయో మరి..!!

ఈ సారి ఏపీలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అనుగుణంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగింది

Published By: HashtagU Telugu Desk
Ap Postal Voting

Ap Postal Voting

ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ (AP Postal Voting) పూర్తి అయ్యింది. గత ఎన్నికలతో పోలీస్ ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ డబుల్ జరిగిందని అధికారులు చెపుతున్నారు. దీంతో అధికార – ప్రతిపక్ష నేతల్లో భయం మొదలైంది. ఓటింగ్ లో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారనే సంగతి తెలిసిందే. ఉద్యోగుల వల్లే కీలక పార్టీలు ఓటమి చెందిన రోజులు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో బాబు ఓటమికి కారణం వీరు కూడా ఉన్నారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈసారి వీరు ఎవరికీ మద్దతు తెలిపారనేది ఇప్పుడు టెన్షన్ గా మారింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అనే ఆప్షన్ ను ఎన్నికల సంఘం ఇస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

పోలింగ్‌ నాడు వీరంతా విధుల్లో ఉంటారు కాబట్టి ముందుగానే వారు ఓటును వేసే అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ సారి ఏపీలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అనుగుణంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగింది. ఎంతలా అంటే గతేడాదితో పోలిస్తే డబుల్‌ అయిందని తెలుస్తోంది. మరి వీరు ఎవరికీ తమ ఓటు వేశారనేది చూడాలి.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ సర్కార్ కు పూర్తి వ్యతిరేకతతో ఉన్న సంగతి తెలిసిందే. వారికీ రావాల్సిన ఎలాంటి సదుపాయాలు ఇవ్వకపోవడం తో ఉద్యోగస్థులంతా జగన్ ఫై మండిపడుతున్నారు. ఇక వీరంతా కూటమికే మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్నీ నేడు చంద్రబాబు..చీపురుపల్లి సభలో చెప్పుకొచ్చారు. ఉద్యోగస్థులంతా కూటమికి మద్దతు ఇచ్చారని..వీరు మాత్రమే కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు..పక్కంటి వారు ఇలా అంత కూడా కూటమికే ఓటు వేయాలని కోరారు.

Read Also : Tandel Director Planning Two Climax : ఆ సినిమాకు రెండు క్లైమాక్స్ లు సిద్ధం చేస్తున్నారట.. ఇదేం ట్విస్ట్ సామీ..!

  Last Updated: 09 May 2024, 11:20 PM IST