Site icon HashtagU Telugu

Pawan Kalyan: నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజల కోసమే పని చేస్తా: పవన్ కళ్యాణ్

Why Is Pawan Kalyan Not In The Campaign..

Why Is Pawan Kalyan Not In The Campaign..

Pawan Kalyan: నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజల కోసమే పని చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో ఆయ‌న మాట్లాడారు. నేను గత ఎన్నికలలో పోటీ చేస్తే ఒక్క స్థానం ఇచ్చారు. ముందు నన్ను, నా పార్టీని గెలిపించండి. ఆ స్థానాలను బట్టి సీఎం అభ్యర్థిపై చర్చ చేద్దామ‌ని.. వసుదైక కుటుంబం అనే ఆలోచన లేకుండా ఎలా ముందుకు సాగుతాం అని ప్ర‌శ్నించారు. కులాలను కలుపుకుని ఐక్యంగా అడుగులు వేద్దామ‌ని పిలుపునిచ్చారు. వైసీపీ ట్రాప్ లో కొంతమంది పడిపోతున్నారు .వాళ్ల మాయలో పడి క్యాస్ట్ పాలిటిక్స్ చేయకండి. మానవత్వం ఉన్న వాడు అన్ని కులాలను సమానంగా చూస్తారని పేర్కొన్నారు.

ఒక్క కులం అని ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదు. వైసీపీ కులాల వారీగా ప్రజలను చీల్చడానికి కుట్ర చేస్తుందన్నారు. 2019లో నేను ఓడినా.. నా వాళ్లే నా వెంట నడిచారు. కొంతమంది వెళ్లిపోతామన్నా.. నేను ఆపను.. అది వాళ్ల ఇష్టం. సీట్ల కోసం వచ్చిన వాళ్లు మాత్రం సీట్లు మార్చుకున్నారు. పెద్ద స్థాయి నుంచి వచ్చామని నా మీద పెత్తనం చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. మంచి పని చేసేటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకూడదన్నారు. నా సినిమాలు ఆపినా.. బెదిరించినా నేనెప్పుడూ జాతీయ స్థాయి నాయకులను అడగలేదని.. నా‌ పోరాటం నా గడ్డపై నేనే చేశానని.. నా ఇబ్బందులను నేనే ఎదుర్కొని నిలబడతాన‌ని స్ప‌ష్టం చేశారు.

నేడు టీడీపీ, జనసేన కలిసి వెళ్లడానికి కార్యకర్తలు కూడా ఒక‌ కారణం అని వివ‌రించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ, జనసేన కలిసి పని చేశాయని.. వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలంటే కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంద‌ని అన్నారు. 2009లో‌ పార్టీ ఓడినా.. నడపలేక పోవడం వల్ల తప్పు జరిగిందన్నారు. నేను నా ప్రాణం ఉన్నంత వరకూ జనసేనను ముందుకు తీసుకెళతాప‌పి స్ప‌ష్టం చేశారు. ఎన్ని అడ్డంలకులు ఎదురైనా పార్టీ నడపాలని తొలిరోజే నిర్ణయం తీసుకున్నాను. నేడు ఆరు లక్షల మంది జనసేన సైనికుల‌తో కలిసి నడుస్తున్నాన‌న్నారు. నాయకుడు అనే వాడు అన్నీ తట్టుకుని నిలబడాల‌న్నారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు.