Posani : సబ్ జైల్లో పోసాని.. ఖైదీ నంబర్ ’11’

Posani : పోసానికి కేటాయించిన నంబర్లను కలిపితే 11 వస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సెటైర్లు

Published By: HashtagU Telugu Desk
Posani11

Posani11

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ (YCP) కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ఘోర ఓటమి మూటకట్టుకుంది. ఈ 11 వల్ల కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. 175 కు 175 సాధిస్తాం అని గొప్పలు చెప్పిన వైసీపీ నేతలు , 11 వచ్చేసరికి కనీసం ముఖం కూడా చూపించుకోలేకపోయారు. ఈ 11 పై కూటమి నేతలే కాదు సినీ ప్రముఖులు సైతం సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. సినీ ఫంక్షన్లలోనే కాదు బుల్లితెర షోస్ లలో కూడా వైసీపీ 11 పై తమదైన శైలిలో కామెంట్స్ వేస్తున్నారు. తాజాగా పోసాని (Posani) కి కూడా ఇదే నెం ను సబ్ జైలు అధికారులు ఇచ్చారని టీడీపీ శ్రేణులు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నేపథ్యంలో పోలీసులు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ ( Posani Krishna Murali )ని అరెస్ట్ చేసారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టైన పోసానిని గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఆయనను సుమారు 8 గంటల పాటు విచారించి, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రాత్రి 9.30 గంటలకు రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు.

Former CJI Chandrachud: పూణే రేప్ కేసు నిర్భయ కేసును గుర్తు చేస్తుంది.. మాజీ CJI చంద్రచూడ్

కోర్టులో శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల వరకు సుదీర్ఘ వాదనలు జరిగాయి. పోసాని తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్‌ఎస్‌ చట్టం ప్రకారం 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అయితే పోసానికి రిమాండ్ విధించాలనే వాదనను పోలీసుల తరఫు న్యాయవాది వినిపించారు. ఇరు వైపుల వాదనలు విన్న మేజిస్ట్రేట్, పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో పోసాని కృష్ణ మురళీని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు జైలు అధికారులు 2261 నంబర్ కేటాయించారు. పోసాని కోసం జైలులో ఓ గది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా పోసానికి కేటాయించిన నంబర్లను కలిపితే 11 వస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. వైసీపీకి ఆ నంబర్ కలిసొచ్చిందంటూ జోకులు వేసుకుంటున్నారు.

  Last Updated: 28 Feb 2025, 12:08 PM IST