Chiranjeevi : చిరంజీవి ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని

చిరంజీవికి ప్రజలు అంటే లెక్క లేదు. ప్రజా సేవ అని పార్టీ పెట్టీ మూసేసాడు. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదు.. సినిమా లానే రాజకీయాల్ని బిజినెస్ లా చూశాడు

Published By: HashtagU Telugu Desk
Posani Chiru

Posani Chiru

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు రోజు రోజుకు చిత్రసీమ నుండి మద్దతు పెరుగుతుండడం వైసీపీ (YCP) తట్టుకోలేకపోతుంది. చిరంజీవి మద్దతు తెలిపిన దగ్గరి నుండి ఒకరి తర్వాత ఒకరు పవన్ మద్దతు తెలపడమే కాదు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఫై నిత్యం హాట్ కామెంట్స్ చేసే పోసాని కృష్ణ మురళి..మరోసారి మీడియా ముందుకు వచ్చి చిరంజీవి ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయాలకు చిరంజీవి అన్ ఫిట్ అంటూ పోసాని (Posani Krishnamurali) చెప్పుకొచ్చారు. చిరంజీవికి ప్రజలు అంటే లెక్క లేదు. ప్రజా సేవ అని పార్టీ పెట్టీ మూసేసాడు. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదు.. సినిమా లానే రాజకీయాల్ని బిజినెస్ లా చూశాడు. 18 మంది ఎంఎల్ఏ లను కాంగ్రెస్ కి అమ్మేశాడు. రాజకీయాలు వద్దని సినిమాలోకి వెళ్ళాడు.. ఇప్పుడు మళ్ళీ రాజకీయ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదు. చిరంజీవిని నమ్మి చాలా మంది కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇక అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు కాదు.. ప్రజల అభివృద్దే రాష్ట్ర అభివృద్ధి అని, చంద్రబాబు పాలనలో పేదలు జీవచ్ఛవంలా ఉండిపోయారు. జగన్ సంక్షేమ పాలనలో పేదలు అభివృద్ధిలోకి వచ్చారని ప్రశంసలు కురిపించారు. అర్బన్ ప్రాంతాల్లో ఉండే ధనవంతులకు గ్రామాల్లో ఉండే పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి..? ఆ పేదల కష్టాలు చూసి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారు. చంద్రబాబు అండ్ కో కి పేదలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదంటూ కీలక ఆరోపణలు చేసారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏమీ సంపద సృష్టించాడు..? అర్బన్ ఓటర్లు చంద్రబాబు ఏమీ చేశాడో.. జగన్ ఏమీ చేశాడో ఆలోచించాలి.. అర్బన్ ఓటర్లు గ్రామాల్లోని పేద కుటుంబాల్లో జరిగిన అభివృద్ధి గమనించాలి అని పోసాని అన్నారు. పోసాని వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : TG : రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే ముందుకురా..కేటీఆర్ సవాల్

.

  Last Updated: 08 May 2024, 04:01 PM IST