సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి (Posani ) కర్నూలు కోర్టు (Kurnool Court) 14 రోజుల రిమాండ్ విధించింది. దీనికి అనుగుణంగా పోలీసులు ఆయనను కర్నూలు జైలుకు తరలించారు. ఈ నెల 18 వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. ఆదోని పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించిన వాదనలు కర్నూలు కోర్టులో పూర్తయ్యాయి. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Credit Card Rules: ఏప్రిల్ 1 నుండి ఈ క్రెడిట్ కార్డ్‌ల నియమాలు మారనున్నాయా?
పోసాని తన ఆరోగ్యం సరిగాలేదని, ఆదోని జైలు కంటే కర్నూలు జైలులో ఉండే అవకాశం కల్పించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై న్యాయమూర్తి అనుకూలంగా స్పందించి, ఆయనను కర్నూలు జైలుకు తరలించేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం పోలీసులు అన్ని విధివిధానాలు పూర్తి చేసి పోసాని కృష్ణమురళిని అక్కడికి తీసుకెళ్లారు. పోసాని కేసు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదోని పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదు చేసిన కేసు విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. అయితే పోసాని రిమాండ్ నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
India vs Australia: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్.. మరోసారి రాణించిన కోహ్లీ!
ఈ వ్యవహారంపై పోసాని కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరంగా ముందుకెళ్లేందుకు ఆయన న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. రిమాండ్ ముగిసే వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుందా, లేక ముందుగా బెయిల్ పొందే అవకాశముందా అనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది.