Posani : ఏపీలో భర్తలని మించిన భార్యలు ఉన్నారంటూ భువనేశ్వరి , బ్రహ్మణి లను టార్గెట్ చేసిన పోసాని

అత్తాకోడళ్లు ఇద్దరూ మా ఆయన మంచివాళ్ళని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబును జైలుకు పంపింది జగన్ ఎలా అవుతారని ప్రశ్నించారు పోసాని.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 02:14 PM IST

సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గత కొద్దీ రోజులుగా ఈయన టీడిపి , జనసేన పార్టీల (TDP – Janasena) ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చిన దగ్గరి నుండి మరింత రెచ్చిపోతున్నారు. ఈయన వ్యాఖ్యలపై అవతలి పార్టీల నుండి హెచ్చరికలు వస్తున్న ఏమాత్రం లెక్క చేయకుండా అలాగే సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

తప్పు చేస్తే నిలదీయాల్సింది పోయి.. సమర్థిస్తున్నారు

చంద్రబాబు అరెస్ట్ తరువాత నిరసనలు , ఆందోళనలు , ధర్నాలతో రాష్ట్రం దద్దరిల్లుతుంది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తో పాటు లోకేష్ భార్య నారా బ్రహ్మణి వరుస ఆందోళనలు , వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమ్మలో నారా భువనేశ్వరి , నారా బ్రహ్మణి లను పోసాని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భర్తలని మించిన భార్యలు ఉన్నారంటూ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari), బ్రహ్మణి (Nara Bramhani) టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు చేశారు. తప్పు చేస్తే నిలదీయాల్సింది పోయి.. సమర్థిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

పవన్ కళ్యాణ్ ఓ పిచ్చోడు, అమాయకుడు

భర్త, కొడుకు నాశనం కావటానికి ప్రధాన కారణం భువనేశ్వరేనంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. అత్తాకోడళ్లు ఇద్దరూ మా ఆయన మంచివాళ్ళని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబును (Chandrababu) జైలుకు పంపింది జగన్ (CM jagan) ఎలా అవుతారని ప్రశ్నించారు పోసాని. అలా పంపించాలనుకుంటే నాలుగేళ్ల ముందే పంపించే వారు కదా అని అన్నారు. ఒక్కపుడు చంద్రబాబు, లోకేష్ (Nara Lokesh) ను తిట్టిన పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాడంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పిచ్చోడు, అమాయకుడంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని. కాపు ఓట్ల కోసమే టీడీపీ నేతలు పవన్ కల్యాణ్‌ ను వాడుకుంటున్నారని ఆరోపించారు. భారతదేశానికి ఒకరే గాంధీ.. కానీ ఏపీకి చంద్రబాబు, లోకేష్ ఇద్దరు గాంధీలంటూ సెటైర్లు విసిరారు. జగన్ మోహన్ రెడ్డి నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు సత్యమేవ జయతే ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. జయప్రద లాంటి వాళ్లు ప్రజాసేవ కోసం వస్తే వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు.

Read Also : Pawan Kalyan Disappointed : అవనిగడ్డ లో పవన్ వెనక్కు తగ్గాడా..? కారణం ఏంటి..?