Posani Krishan Murali : ఎట్టకేలకు జైలు నుంచి సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదల అయ్యారు. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ రావడంతో గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇరుక్కొని జైలు పాలైన పోసాని కృష్ణమురళిని ఫిబ్రవరి 26 అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టై చేశారు. అనంతరం ఆయనపై ఉన్న వివిధ కేసుల్లో కర్నూలు, గుంటూరు పోలీసులు కూడా విచారించారు. అందుకే ఆయన్ని కర్నూలు జైలులో కొన్నిరోజులు, గుంటూరు జిల్లా జైలులో మరికొన్ని రోజులు ఉంచారు. అన్ని కేసుల్లో కూడా శుక్రవారం నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన్ని ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు.
Read Also: Jnanpith Award : వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్
కాగా, పోసాని కృష్ణమురళి ఫిబ్రవరి 26న అరెస్టై బెయిల్ వచ్చినట్లే వచ్చి మళ్లీ రిమాండ్ లోనే గడపాల్సి వచ్చింది. వివిధ స్టేషన్లలో నమోదైన కేసులతో బెయిల్ వచ్చినా పోలీసులు మళ్లీ రిమాండ్ కు తరలిస్తూ వచ్చారు. పోసానికి బెయిల్ వచ్చినా సీఐడీ పీటీ వారెంట్ తో జైల్లో రిమాండులో ఉన్నారు. దీంతో తన ఆరోగ్య సమస్యల కారణాలని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. శుక్రవారం (మార్చి 21) గుంటూరు కోర్టు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటీషన్ ని పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది. . దీంతో శనివారం బెయిల్ పై విడుదల అయ్యారు.
ఇక, పోసానిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నటైంలో ఆయన తీవ్ర నిరాశతో మాట్లాడారు. కోర్టు న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించిన తర్వాత న్యాయమూర్తితో మాట్లాడారు. తనకు 70ఏళ్ల వయసు వచ్చిందని చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యమని అన్నారు. ఎప్పుడు ఏ కేసులో తనను తీసుకెళ్తున్నరో కూడా తెలియడం లేదని ఈ వయసులో ఇలా చేయడం సరికాదని అన్నారు. పీపీలు కూడా అన్యాయంగా వాదిస్తున్నారని వాపోయారు. రెండుసార్లు స్టంట్‌లు వేశారని ఆరోగ్యం సహకరించడం లేదని తెలిపారు. లైడిటెక్టర్ పరీక్ష చేసి తాను తప్పు చేసినట్టు నిరూపితమైతే నరికేయాలని న్యాయమూర్తితో పోసాని కృష్ణమురళి అన్నారు.
Read Also: KKR vs RCB : ఫిల్ సాల్ట్ తో కేకేఆర్ జాగ్రత్త..