Site icon HashtagU Telugu

Posani Krishna Murali : నంది నాటకోత్సవాలపై పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్.. అవార్డుల ప్రకటన ఆ రోజే..

Posani Krishna Murali Press meet about Nandi Awards in AP

Posani Krishna Murali Press meet about Nandi Awards in AP

రెండు తెలుగు ప్రభుత్వాలు ఎప్పుడో నంది అవార్డులు(Nandi Awards) ఆపేసాయి. సినీ పెద్దలు ఎంత ప్రయత్నించినా ప్రభుత్వాలు మాత్రం నంది అవార్డుల గురించి పట్టించుకోవట్లేదు. అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్(APFDC) పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) నంది అవార్డులు సినిమా వాళ్లకు ఇప్పుడు ఇవ్వలేము, నాటకాల వాళ్లకు ప్రస్తుతం ఇస్తాము అని అప్లై చేసుకోమని తెలిపారు.

తాజాగా నేడు పోసాని కృష్ణమురళి మరోసారి నంది నాటకోత్సవాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో పోసాని మాట్లాడుతూ.. నంది నాటకోత్సవాల కోసం దరఖాస్తులు ఆహ్వానించాం. నాటకాలకు 115, ఉత్తమ పుస్తకాల కేటగిరి 3 దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ 7-18 వరకు స్క్రూటినీ జరుగుతుంది. 19వ తేదీ వరకు అవార్డుల ప్రకటన చేస్తాం. అవార్డుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుంది. నాటలకలకు అందిన దరఖాస్తుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాము అని తెలిపారు.

అలాగే.. త్వరలో ఏపీలో ఉన్న నటులు, ఫైటర్లు, సంగీత దర్శకులు, ఇతర కళాకారులకు ఐడెంటిటీ కార్డులు ఇస్తాము. కళాకారులకు ఇవ్వాల్సిన రాయితీలపై కూడా త్వరలో దృష్టి పెడతాము. చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ లు షూటింగ్ కు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో ఉన్న కళాకారులు అందరిని ఒకే తాటిపైకి వచ్చి ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏపీలో ఉన్న కళాకారుల లిస్ట్ మొత్తం రెడీ అయితే షూటింగ్ లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా మంది కళాకారులు దళారుల చేతిలో పడి ఇబ్బందులు పడుతున్నారు. కళాకారుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాము అని తెలిపారు.

 

Also Read : Raghava Lawrence : నా ట్రస్ట్‌కి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దు.. ఎందుకంటే రాఘవ లారెన్స్