Posani Krishna Murali : నారా బ్రాహ్మణికి పోసాని కృష్ణమురళి నాలుగు ప్రశ్నలు.. వీటికి సమాధానాలు చెప్పాలి..

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి చంద్రబాబు అరెస్ట్ అంశంపై ప్రెస్ మీట్ పెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Posani Krishna Murali four Questions to Nara Brahmani

Posani Krishna Murali four Questions to Nara Brahmani

ఏపీ రాజకీయాల్లో(Ap Politics) చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) అంశం రోజు రోజుకి మరింత సంక్లిష్టం అవుతుంది. వైసీపీ(YCP) నాయకులు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్స్ పెట్టి చంద్రబాబుపై, టీడీపీ(TDP) నాయకులపైన ఫైర్ అవుతూనే ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా బ్రాహ్మణి(Nara Brahmani) కూడా బయటకి వచ్చి రాజకీయాల్లో తిరుగుతుంది. మామయ్య కోసం ప్రజలతో తిరుగుతుంది. మీడియా ముందుకు కూడా వచ్చి మాట్లాడుతూ వైసీపీ మీద ఫైర్ అవుతుంది.

దీంతో పలువురు వైసీపీ నాయకులు ఇప్పుడు బ్రాహ్మణి మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు. నిన్న రోజా ప్రెస్ మీట్ పెట్టి బ్రాహ్మణి మీద ఫైర్ అయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి చంద్రబాబు అరెస్ట్ అంశంపై ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో చంద్రబాబు అరెస్ట్ గురించిమాట్లాడి, చంద్రబాబు ని విమర్శించి, చంద్రబాబుపై సెటైర్లు వేశారు. అనంతరం నారా బ్రాహ్మణిపై కూడా కౌంటర్లు వేశారు పోసాని.

APFDC చైర్మన్ పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో. బ్రాహ్మణి నేను అడిగే నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు, మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు, మీ తాతయ్యను చంపిందెవరు, జగన్ దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలను మీ మామయ్య ఎందుకు కొన్నారు. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబితే నీ కాళ్లకు దండం పెడతా అని అన్నారు. దీంతో పోసాని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి పోసాని వ్యాఖ్యలకు ఎవరైనా టీడీపీ నాయకులు కౌంటర్ ఇస్తారేమో చూడాలి.

 

Also Read : AP BRS: వైసీపీ పాలనతో ఏపీ అప్పుల ఊబిలో మునిగి దివాళా తీస్తోంది: డాక్టర్ తోట

  Last Updated: 19 Sep 2023, 06:00 PM IST