Posani : ఊపిరి పీల్చుకున్న పోసాని బెయిల్

Posani : అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయడంతో పాటు, పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది

Published By: HashtagU Telugu Desk
Posani Bail

Posani Bail

వైసీపీ నేత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కడప మొబైల్ కోర్టు ఊరట కలిగించే తీర్పు ఇచ్చింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయడంతో పాటు, పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. అయితే పోసాని పూర్తి స్వేచ్ఛ పొందాలంటే నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ బెయిల్ మంజూరవ్వాలి.

Big boost for Movie Lovers : మల్టీప్లెక్స్‌ల టికెట్ ధరల దోపిడీకి చెక్ పెట్టిన ప్రభుత్వం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని మీద గత నెల 24వ తేదీన ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో FIR నమోదు అయ్యింది. దీనిపై 28వ తేదీన పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. 29న రైల్వే కోడూరు కోర్టు ఎదుట హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఓబులవారిపల్లి పోలీసులు పోసానిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కోర్టు పోలీసుల అభ్యర్థనను తిరస్కరించి, పోసానికి బెయిల్ మంజూరు చేసింది. కానీ నరసరావుపేట మరియు ఆదోని కోర్టుల నుంచి కూడా బెయిల్ మంజూరైతేనే పోసాని పూర్తిగా విడుదల అవుతారు.

ప్రస్తుతం కడప కోర్టు ఇచ్చిన బెయిల్ తో పోసానికి కొంత ఊరట లభించినప్పటికీ, మిగతా కోర్టుల తీర్పులు ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఏదైనా ఒక్క కోర్టు బెయిల్ రద్దు చేస్తే, పోసాని పై కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. దీంతో ఇంకొంతకాలం ఆయన జైలులోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

ICC Player Of Month Nominees: ఐసీసీ ప్రత్యేక అవార్డుకు శుభ్‌మన్ గిల్ నామినేట్!

 

 

 

  Last Updated: 07 Mar 2025, 05:49 PM IST