Jagan’s Declaration : సినీ నటుడు , వైసీపీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali) చాల గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఎప్పటిలాగానే తన నోటికి పనిచెప్పారు. గత కొద్దీ రోజులుగా ఏపీలో తిరుమల లడ్డు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డు ప్రసాదం (Tirumala Laddu Controversy) లో అపవిత్రం జరిగిందని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పడం తో దేశ వ్యాప్తంగా వివాదంగా మారింది.
దీనిపై యావత్ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..వైసీపీ (YCP) మాత్రం ఎలాంటి తప్పు జరగలేదని చెప్పుకొచ్చింది. ఇదే క్రమంలో జగన్ తిరుమల టూర్ మరింత వివాదమైంది. జగన్ డిక్లరేషన్ (Jagan Declaration) ఇస్తేనే శ్రీవారి దర్శనం చేయాలంటూ కూటమి సర్కార్ తేల్చి చెప్పడం..దానిపై వైసీపీ నేతలు విరుచుకుపడడం..జగన్ తిరుమల టూర్ ను అడ్డుకుంటామని బీజేపీ హెచ్చరించడం..ఇలా అనేక పరిణామాల మధ్య జగన్ తన టూర్ ను రద్దు చేసుకొని , తన ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు.
జగన్ డిక్లరేషన్ అంశం ఫై వైసీపీ నేతలు స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పోసాని సైతం ఈరోజు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఫై తనదైన శైలి లో హాట్ కామెంట్స్ చేసారు. జగన్‌మోహన్‌రెడ్డి ది గ్రేట్ పాలిటిక్స్.. చంద్రబాబుది డర్టీ పాలిటిక్స్ అంటూ పోసాని పేర్కొన్నారు. తిరుమల పర్యటనకు సంబంధించి జగన్‌ను డిక్లరేషన్ అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. హిందూ ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న బాబు.. ఒకప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మద్యం అమ్మకాలు జరగడం లేదని ఘోరంగా వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు.
మతతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నానని, ఇదే విషయాన్ని గతంలో మసీద్‌లోనే చెప్పాడని గుర్తు చేశారు. తనకు ఏ పార్టీలో కలవాలని లేకున్నా కూడా ఢిల్లీ నుంచి వచ్చి కలవండి అంటే బీజేపీలో కలిశాను అని బాబు చెప్పాడని తెలిపారు. మోదీ అంటే కేడీ.. కేడీ అంటే మోదీ అని ఘోరంగా తిట్టిన బాబు.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి మోదీ.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న ఫోటోలను కూడా చూశామని ఎద్దేవా చేశారు. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ‘చంద్రబాబు లాంటి వ్యక్తి ఉంటాడనే అంబేద్కర్ చాలా బలమైన రాజ్యాంగం రాశారు. ఓట్ల కోసం క్రిస్టియన్, ముస్లింల ఇంటికి చంద్రబాబు వెళ్లలేదా?, నేను, నా భార్య కలిసి చర్చ్, మసీద్‌కు వెళ్లాం. మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ అఫిడవిట్ అడగలేదని పోసాని పేర్కొన్నారు.
Read Also : Bharat Biotech : సాలార్ జంగ్ మ్యూజియం, అమ్మపల్లి ఆలయంను పునరుద్ధరించనున్న భారత్ బయోటెక్