Pawan Kalyan 5th Wife : పవన్ కళ్యాణ్ కు ఐదో భార్య కూడా ఉందంటూ పోసాని సంచలన ఆరోపణలు

పవన్ కళ్యాణ్ కు నలుగురు పెళ్ళాలు ఉన్నారని, ఐదో పెళ్ళాం కూడా ఉందని, ఆమె వెయిటింగ్ లో ఉందని పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేసారు

Published By: HashtagU Telugu Desk
Posani Pawan

Posani Pawan

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ముగ్గురు , నలుగురు భార్యలే (Pawan Wifes) కాదు ఐదో భార్య (Pawan Kalyan 5th Wife) కూడా ఉంది..ప్రస్తుతం ఆమె వెయిటింగ్ లో ఉందంటూ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో దుమారం రేపుతున్నాయి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ – కూటమి శ్రేణుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రాజకీయ వ్యాఖ్యల నుండి పర్సనల్ ఎటాక్ వరకు వెళ్తుంది. సీఎం జగన్ పదే పదే తన ప్రసంగాల్లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి , భార్యల గురించి కామెంట్స్ చేస్తూ వస్తుండడంతో..పవన్ కళ్యాణ్ సైతం జగన్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ఈ రియాక్షన్ తర్వాత వైసీపీ శ్రేణులు ఎదురుదాడికి దిగారు.

ఈ మాటల దాడిలో పోసాని కూడా జాయిన్ అయ్యారు. తాజాగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫై అలాగే జనసేన ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. కాపులలో ఎవరు సీఎంగా పనికిరారని చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ సరెండర్ అయ్యారని .. పవన్ కళ్యాణ్ ఒక మెంటల్ కేస్ అని, రాజకీయాలలో రోజురోజుకీ పవన్ కళ్యాణ్ దిగజారి పోతున్నారని పోసాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు చిరంజీవి వల్ల కూడా ఏపీలో కాపులంతా ఇబ్బంది పడ్డారు అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కళ్యాణ్ కు నలుగురు పెళ్ళాలు ఉన్నారని, ఐదో పెళ్ళాం కూడా ఉందని, ఆమె వెయిటింగ్ లో ఉందని పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేసారు. పవన్ కళ్యాణ్ కు డబ్బు, అధికారమే కావాలని, కానీ పవన్ సభలకు వచ్చిన ఎవరూ ఆయనకు ఓటేయరు పోసాని చెప్పుకొచ్చారు. జగన్ ప్రజల కోసం పార్టీ పెట్టారు.. మెగా ఫ్యామిలీ పైసల కోసం పార్టీలు పెట్టింది.. ఇదే జగన్‌కు పవన్ కల్యాణ్, చిరంజీవికి ఉన్న తేడా అంటూ పోసాని కీలక ఆరోపణలు చేసారు. గతంలో కూడా పోసాని పవన్ కళ్యాణ్ ఫై ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడం తో ఆయనపై పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకానొక టైములో పోసాని ఫై దాడి చేసేందుకు ట్రై కూడా చేసారు. ఆ తర్వాత సైలెంట్ అయినా పోసాని..ఇప్పుడు మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు..ఇప్పుడు అభిమానులు , జనసేన శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read Also : Summer Trip: సమ్మర్ వెకేషన్ కు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే తక్కువ బడ్జెట్ లో ఈ దేశాలకు వెళ్లండి

  Last Updated: 22 Apr 2024, 08:50 PM IST