Chandrababu: పేదలు సంక్రాంతి పండగను కూడా చేసుకోలేని పరిస్థితి: చంద్రబాబు నాయుడు

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 06:21 PM IST

Chandrababu: వైకాపా ప్రభుత్వ పాలనలో పేదలు సంక్రాంతి పండగను కూడా చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని  మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రంగాలను సీఎం జగన్‌ రివర్స్‌ గేర్‌లో పెట్టారని.. ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని  అన్నారు. ఉన్నప్పుడు పండగ సమయంలో ఉచితంగా సరకులిచ్చామని గుర్తుచేశారు. తమ హయాంలో పేదల కోసం అన్న క్యాంటీన్‌లను తీసుకొచ్చి రూ.5కే పేదల కడుపు నింపామని చెప్పారు.

టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది.. ఛార్జీలు తగ్గిస్తాం. సౌర, పవన విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. వినూత్న ఆలోచనలు, పద్ధతులతో ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను మోసం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగులకు రూ.3వేల భృతి చెల్లిస్తాం. జగన్‌ చెప్పేవన్నీ అసత్యాలే. అధికారంలోకి వచ్చాక పింఛన్‌ రూ.3వేల ఇస్తామని.. జగన్‌ మాట తప్పారు.

2019లో తెదేపా అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి నుంచే రూ.3వేలు ఇచ్చేవాళ్లం. వైకాపాకు ఓటేస్తే మళ్లీ అందరినీ బానిసలుగా మారుస్తారు’’ అని చంద్రబాబు అన్నారు. ‘‘పేదల బలహీనతను ఆసరా చేసుకుని వైకాపా ప్రభుత్వం దోచుకుంటోంది. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధమని జగన్‌ చెప్పారు. నిషేధం చేయకపోతే ఓట్లు అడగనన్నారు. ఇవాళ అనేక రకాల మద్యం తీసుకొచ్చి పేదలను దోచుకుంటున్నారు. జగన్‌ అప్పుల పాపారావు.. విపరీతంగా అప్పులు చేశారు.

కాగా బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న మూడు కేసులపై విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. IRR, మద్యం, ఉచిత ఇసుక కేసులల్లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్స్ సిద్ధార్థ లూథ్ర.. దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు.