Poor Jagan : మ‌ళ్లీ హైకోర్టుకు జీవో No.1, యువ‌గ‌ళం, వారాహిల‌కు`సుప్రీం` ఊర‌ట‌

జీవో నెంబ‌ర్ 1 రూపంలో జ‌గ‌న్ స‌ర్కార్(Poor Jagan) కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.

  • Written By:
  • Updated On - January 20, 2023 / 03:07 PM IST

జీవో నెంబ‌ర్ 1 రూపంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్(Poor Jagan) కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఆ జీవో మీద హైకోర్టులో తేల్చుకోవాల‌ని ఆదేశించింది. ఫ‌లితంగా ఈనెల 27వ తేదీన జ‌రిగే యువ‌గ‌ళం(Yuvagalam) ప్రోగ్రామ్ కు మార్గం సుగ‌మ‌మం అయింది. అంతేకాదు, ఈనెల 26వ తేదీ నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ చేప‌ట్టే `వారాహి` ప్ర‌యాణం స‌వ్యంగా సాగుతుంద‌ని జ‌న‌సైనికులు భావిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సమావేశాల మీద ఆంక్ష‌లు పెట్టే విధంగా బ్రిటీష్ కాలం నాటి జీవో నెంబ‌ర్ 1 ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ జారీ చేసిన విష‌యం విదిత‌మే. దానిపై హైకోర్టు స్టే విధించింది. దాన్ని స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిష‌న్ పై శుక్ర‌వారం విచార‌ణ జ‌రిగింది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్  కు సుప్రీం షాక్(Poor Jagan)

ఏపీ ప్ర‌భుత్వం పిటిష‌న్ ను సుప్రీం కోర్టు ప‌రిశీలించింది. కేసు మెరిట్స్ పై ప్ర‌స్తుతం ఎలాంటి విచారణ చేపట్ట‌లేమ‌ని తేల్చేసింది. వాద‌ప్ర‌తివాద‌న‌ల‌ను హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఎదుట వినిపించాల‌ని సూచించింది. ఈనెల 23వ తేదీన హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎదుట విచార‌ణ చేయాల‌ని ఆదేశించింది. అన్ని అంశాల‌ను బ‌హిరంగంగా ఉంచుతామ‌ని సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ధ‌ర్మాస‌నం చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‍పై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు (Poor Jagan) సుప్రీం కోర్టులోనూ చుక్కెదురు అయింది.

Also Read : Jagan jail : జ‌గ‌న్ జ‌మానాలో అధికారుల‌కు జైలు శిక్ష‌, క్ష‌మాప‌ణ‌తో తీర్పు స‌వ‌ర‌ణ‌

`ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` అంటూ చంద్ర‌బాబు పెట్టిన స‌భ‌ల‌కు జ‌నం అనూహ్యంగా రావ‌డాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం గ్ర‌హించింది. యాదృశ్చికంగా నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో తొక్కిస‌లాట జ‌రిగింది. దీంతో 11 మంది మృతి చెందిన అంశాన్ని చూపుతూ జీవో నెంబ‌ర్ 1ను ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసింది. దాని ప్ర‌కారం ముంద‌స్తుగా అనుమ‌తి ఉంటేనే, రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించుకోవాలి. అంతేకాదు, పోలీసులు నిర్ణ‌యించే ప్రాంతంలో ప‌రిమిత సంఖ్య‌లో జ‌నం ఉండేలా స‌భ‌లు, రోడ్ షోలు పెట్టుకోవాలి. ఆ జీవో జారీ చేసిన మ‌రుస‌టి రోజే చంద్ర‌బాబు కుప్పం వెళ్ల‌గా అక్క‌డి పోలీసులు అడ్డుకున్నారు. ఆయ‌న్ను సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంకు కూడా వెళ్ల‌నివ్వ‌లేదు. దీంతో జీవోను నిర‌సిస్తూ చంద్ర‌బాబు ఆందోళ‌న‌కు దిగారు. మూడు రోజుల కుప్పం ప‌ర్య‌ట‌న ముగించుకున్న త‌రువాత హైకోర్టులో జీవో నెంబ‌ర్ 1పై పిటిష‌న్ దాఖ‌లు ప‌రిచారు.

యువ‌గ‌ళం , వారాహి యాత్ర‌ల‌ను ఆపాల‌ని

హైకోర్టు సింగిల్ బెంచ్ జీవో నెంబ‌ర్ 1 పై స్టే విధిస్తూ తీర్పు చెప్పింది. దాన్ని స‌వాల్ చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ సుప్రీం కోర్టుకు ఎక్కింది. అక్క‌డ కూడా చుక్కెదురు అయింది. హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఎదుట పిటిష‌న్ పై వాద‌న‌లు ఉంటాయ‌ని సుప్రీం కోర్టు సూచించింది. ఈనెల 23వ తేదీన డివిజ‌న్ బెంచ్ వాద‌న‌ల‌ను విన‌బోతుంది. ఆ రోజున ఇచ్చే తీర్పు సానుకూలంగా లేక‌పోతే మ‌ళ్లీ సుప్రీం మెట్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ తొక్కే అవ‌కాశం ఉంది. జీవో నెంబ‌ర్ 1 అమ‌లు చేయ‌డం ద్వారా ఏదో ర‌కంగా యువ‌గ‌ళం(Yuvagalam), వారాహి యాత్ర‌ల‌ను ఆపాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఒక వేళ జీవోను కొట్టివేస్తూ డివిజ‌న్ బెంచ్ ఈనెల 23వ తేదీన తీర్పు చెబితే ప‌వ‌న్, లోకేష్ యాత్ర‌ల‌కు తిరుగు ఉండ‌దు.

Also Read : TTD Jagan : జ‌గ‌న్ జ‌మానాలో తిరుమ‌ల! మ‌త కుట్ర‌పై విప‌క్షాల ద‌రువు!