Poonam Kaur : పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ ?

Poonam Kaur : క్రిమినల్‌కు శిక్ష పడే వరకు గట్టిగా గళం విప్పాలని ఆమె పిలుపునిచ్చారు. మెయిన్ మీడియా ఈ విషయాన్ని కవర్ చేయకపోవడంపై, రాజకీయ నాయకుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Poonam Tweet

Poonam Tweet

ఆంధ్రప్రదేశ్‌(AP)లో మూడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం (Rape of a three-year-old girl), హత్య ఘటన సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటనపై ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) తీవ్రంగా స్పందించారు. క్రిమినల్‌కు శిక్ష పడే వరకు గట్టిగా గళం విప్పాలని ఆమె పిలుపునిచ్చారు. మెయిన్ మీడియా ఈ విషయాన్ని కవర్ చేయకపోవడంపై, రాజకీయ నాయకుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

“ఈ దారుణానికి పాల్పడిన వాడికి శిక్ష పడే వరకు మనం గొంతు వినిపిస్తూనే ఉండాలి. మెయిన్ మీడియా దీనిని కవర్ చేయలేదు. పొలిటికల్ లీడర్స్‌పై నాకు నమ్మకం లేదు. మనం వినిపించే నిరసన గళంతో ఇలాంటి జంతువుల చేతిలో మరొకరు బాధితులుగా మారకుండా ఉంటారు” అని పూనమ్ కౌర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనం ఉందనుకుంటేనే మీడియా ఇలాంటి వార్తలకు ప్రాధాన్యతనిస్తుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Vallabhaneni Vamshi : వల్లభనేని వంశీకి బిగ్ షాక్

పూనమ్ కౌర్ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటనపై ధైర్యంగా నిలబడినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆమెలాగే మరింత మంది సెలబ్రిటీలు తమ గళం వినిపించాలని, అప్పుడే మన పిల్లలు సురక్షితంగా ఉంటారని ఆకాంక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ ఘటనపై విమర్శించేందుకు ఇప్పటికి చాలా సార్లు మీడియా ముందుకు వచ్చేవాడని విమర్శిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

  Last Updated: 26 May 2025, 05:57 PM IST