Site icon HashtagU Telugu

Poonam Kaur : చంద్రబాబు త్వరగా జైలు నుంచి బయటకు రావాలని నటి పూనం కౌర్‌ పూజలు

Poonam Cbn

Poonam Cbn

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chnadrababu) అరెస్ట్ అయ్యి..రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 40 రోజులుగా పైగా బాబు జైల్లోనే ఉన్నారు. బాబు జైల్లో కు వెళ్లిన దగ్గరి నుండి కోట్లాదిమంది బాబు కు సంఘీభావం తెలుపుతూ..త్వరగా బాబు బయటకు రావాలని కోరుకుంటున్నారు. దేవాలయాల్లో పూజలు , పలు ఆలయాల్లో యాగాలు చేస్తూ వస్తున్నారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ ను పెద్ద ఎత్తున పలు రాజకీయ పార్టీలు , సినీ స్టార్స్ , బిజినెస్ ప్రముఖులు ఖండించడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా నటి పూనం కౌర్‌ (Poonam Kaur) సైతం చంద్రబాబు త్వరగా జైలు నుండి బయటకు రావాలని ప్రత్యేక పూజలు చేసారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న జగన్మాత దుర్గమ్మ (Vijayawada Kanaka Durga Temple)ను ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పెద్ద వయసులో చంద్రబాబు జైల్లో ఉండటం ప్రపంచ వ్యాప్తంగా కలచి వేసిందన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఈ సందర్బంగా తెలిపింది.

Read Also : BRS vs Congress Telangana Polls 2023: : బిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యనే అసలైన పోరు..