Poonam Kaur : జనసేన – టీడీపీ మొదటి లిస్ట్ విడుదల ..కుక్క ఫోటో తో పూనమ్ ట్వీట్

నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నటికి మొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ ను యూజ్లెస్ ఫెలో అంటూ ట్వీట్ చేసి సంచలనం రేపగా..ఇక ఇప్పుడు జనసేన – టీడీపీ కూటమి మొదటి లిస్ట్ ను ప్రకటించగానే..కుక్క ఫోటో ను పోస్ట్ చేసి వైరల్ గా మారింది. టీడిపి – జనసేన(TDP-Janasena) పొత్తులో భాగంగా శనివారం మొదటి లిస్ట్ ను ప్రకటించారు. టీడిపి 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా..జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో , […]

Published By: HashtagU Telugu Desk
Poonam Tweet Dog

Poonam Tweet Dog

నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నటికి మొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ ను యూజ్లెస్ ఫెలో అంటూ ట్వీట్ చేసి సంచలనం రేపగా..ఇక ఇప్పుడు జనసేన – టీడీపీ కూటమి మొదటి లిస్ట్ ను ప్రకటించగానే..కుక్క ఫోటో ను పోస్ట్ చేసి వైరల్ గా మారింది.

టీడిపి – జనసేన(TDP-Janasena) పొత్తులో భాగంగా శనివారం మొదటి లిస్ట్ ను ప్రకటించారు. టీడిపి 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా..జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో , మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే జనసేన కేవలం 5 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించగా..మిగతా అభ్యర్థులను రెండో లిస్ట్ లో ప్రకటించబోతున్నది. ఈ మొదటి లిస్ట్ (TDP- Janasena List) లో పవన్ కళ్యాణ్ పేరు కానీ నాగబాబు పేరు కానీ లేదు. ఇదిలా ఉంటె..ఈ లిస్ట్ ఫై రెండు పార్టీలలో అసంతృప్తి జ్వాలలు మొదలయాయ్యి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతల తాలూకా అభిమానులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ల దిష్టి బొమ్మలను తగలబెట్టడం, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే రాజీనామా లు చేయగా..మరికొంతమంది రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నిన్నటి నుండి ఏపీ లో అంత ఈ జాబితా ఫైనే చర్చ నడుస్తుంది. ఈ తరుణంలో నటి పూనమ్ కౌర్ తన ట్విట్టర్ లో కుక్క ఫొటో( Dog Photo ) ని షేర్ చేసింది. పాత సినిమాలో హీరోయిన్ శ్రీదేవి కుక్కని ఆడిస్తూ ఉన్న ఫొటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ను వైసిపి శ్రేణులు తెగ షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ మొదలుపెట్టారు. పూనమ్ భలే టైమ్ కి కుక్కను వదిలిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు పూనమ్ – పవన్ – త్రివిక్రమ్ మధ్య ఏంజరిగిందో అధికారికంగా తెలియదు కానీ..బయట ప్రచారం మాత్రం పూనమ్ ను మోసం చేసారని అందుకే ఆమె ఇలా ఎప్పటికప్పుడు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటుందని చెపుతున్నారు.

Read Also : Kapu Community : కాపు జాతి మొత్తాన్ని పవన్ అవమానించాడు

  Last Updated: 25 Feb 2024, 03:07 PM IST