Site icon HashtagU Telugu

Poonam Kaur : బాలకృష్ణ అల్లుడి ఫై పూనమ్ కౌర్ ట్వీట్

Poonam Sri Bharath

Poonam Sri Bharath

ప్రస్తుతం ఏపీ (AP)లో ఎన్నికల వేడి ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సినపనిలేదు. అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మాటకు మాట , సవాల్ కు ప్రతి సవాల్స్ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మరింత కాకరేపుతుంది. పూనమ్ (Poonam Kaur) సినిమాలకన్నా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులార్టీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నిత్యం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram) ల ఫై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీ భరత్ ఫై ట్వీట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

గత ఎన్నికల్లో వైజాగ్ ఎంపీ గా పోటీ చేసిన శ్రీ భరత్..వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎం వి వి సత్యనారాయణ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారి మరోసారి వైజాగ్ నుండి ఎంపీగా బరిలోకి దిగుతున్నాడు. ప్రస్తుతం సర్వేలన్నీ ఈసారి శ్రీ భరత్ విజయం ఖాయమే చెపుతున్నాయి. ఈ తరుణంలో పూనమ్ కౌర్ కూడా ఇదే చెప్పుకొచ్చింది. పొలిటికల్ సినారియో చూస్తుంటే బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీ భరత్ ఏదో సాధించేలా కనిపిస్తున్నాడని పూనమ్ ట్వీట్ చేసింది. వైజాగ్ నుంచి శ్రీ భరత్ గెలిచి పార్లమెంటుకు వెళితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఎడ్యుకేషన్ భవిష్యత్తు గురించి శ్రీ భరత్‌కు ఉన్న విజన్ కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవ్వకూడదు అన్నట్టుగా ఆమె ట్వీట్ చేసింది. తాను భరత్ ను సపోర్ట్ చేస్తున్నట్టుగానే భావించాలని పేర్కొన్న ఆమె ఇది ఎవరూ డబ్బులు ఇచ్చి పెట్టించిన ట్వీట్ కాదు, అలాగే స్పాన్సర్ చేసిన ట్వీట్ కాదు అంటూ కూడా స్పష్టం చేసింది. ఈ ట్వీట్ చూసి కూటమి శ్రేణులు పూనమ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Read Also : Pawan Kalyan : దివిసీమ పౌరుషం ఏంటో ఎన్నికల్లో చూపించడండి – పవన్ కళ్యాణ్