Site icon HashtagU Telugu

Poonam Kaur : సీఎం జగన్ ఫై పూనమ్ కౌర్ ప్రశంసలు..మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్

Poonam Jagan

Poonam Jagan

పూనమ్ కౌర్ (Poonam Kaur) ఈ పేరును కొత్తగా పరిచయం చేయవల్సిన అవసరం లేదు. సినిమాల ద్వారా అమ్మడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు కానీ..పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , త్రివిక్రమ్ (Trivikram) ల ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. నిజంగా వారి వల్ల ఈమె ఎంత నష్టపోయిందో తెలియదు కానీ..బయట మాత్రం పూనమ్ కౌర్ కెరియర్ ను వీరిద్దరే నాశనం చేసారని మాత్రం ఓ వర్గం ప్రచారం చేస్తుంటుంది. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా పూనమ్ సైతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేయడం , విమర్శలు , ఆరోపణలు చేయడం చేస్తుంటుంది. రీసెంట్ గా త్రివిక్రమ్ ను యూసెలెస్ ఫెలో అని కామెంట్ చేసి వివాదాస్పద వార్తల్లో నిలిచింది.

ఇదిలా ఉండగా..తాజాగా జగన్ (CM Jagan) ఫై ప్రశంసలు కురిపించి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో , జనసేన శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించింది. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచి అసెంబ్లీ లో అడుగుపెట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అందుకే టీడీపీ తో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే ఉమ్మడి గా సభలు నిర్వహిస్తూ , అభ్యర్థులను ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండాగా..పూనమ్ కౌర్ జగన్ ఫై ప్రశంసలు కురిపించడం..పవన్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా పూనమ్ సోషల్ మీడియా ఖాతాలో ‘కొవిడ్ మహమ్మారి సమయంలో చేనేత కార్మికులకు వైసీపీ అండగా నిలిచింది. వారి కోసం చాలా మంచి పనులు చేసింది. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయం’ అని ఆమె ట్వీట్ చేశారు. ఎన్నికల వేళ పూనమ్ కౌర్ ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ట్వీట్ ఫై ప్రస్తుతం జనశ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..వైసీపీ శ్రేణులు మాత్రం సంబరాలు చేసుకుంటూ షేర్ చేస్తున్నారు.

Read Also : EVs Dangerous : ఈవీలతోనే ఎక్కువ కాలుష్యం.. సంచలన రిపోర్టులో కీలక విషయాలు