Site icon HashtagU Telugu

Poonam Kaur : పవన్ కు సపోర్ట్ గా పూనమ్ కౌర్ ట్వీట్..?

Poonam

Poonam

ప్రస్తుతం ఏపీ (AP)లో ఎన్నికల వేడి ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సినపనిలేదు. అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మాటకు మాట , సవాల్ కు ప్రతి సవాల్స్ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మరింత కాకరేపుతుంది. పూనమ్ (Poonam Kaur) సినిమాలకన్నా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులార్టీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నిత్యం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram) ల ఫై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేసినట్లు అర్ధం అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లాను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిందని, ఇందుకు సంబంధించి ఏపీ అధికారులు ఆ కంపెనీకి మెయిల్ పంపినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మద్దతుదారుడైన ప్రదీప్ రెడ్డి చింతా తన ట్విట్టర్ లో టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏపీలో పెట్టాల్సిందిగా కోరుతూ పోస్టు చేశారు. ”డియర్ ఎలాన్ మస్క్.. నేను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి.. మాది భారతదేశంలోని అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటి. నేను యూకేలో టెస్లా కారు నడుపుతాను.. ఎక్స్‌ను చాలా అమితంగా ఇష్టపడతాను.. ఈ రెండు నా రోజువారీ జీవితంలో భాగం. మేము (ఏపీ ప్రజలం) మీకు మరిన్ని కార్లను తయారు చేయడంలో సహాయం చేయడానికి ఇష్టపడతాము. మీకు స్వాగతం” అని పోస్టు చేశారు.

ఈ ట్వీట్ ఫై పూనమ్ స్పందించింది. ”అతను (ఎలాన్ మస్క్) మూడుసార్లు వివాహం చేసుకున్నాడు.. అది ప్రాబ్లమ్ కాదా?” అని పేర్కొంది. వైసీపీ పార్టీ నేతలు నిత్యం పవన్ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్ల చేసుకున్నాడని విమర్శలు చేస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వైసీపీ వారి దృష్టిలో పెద్ద నేరం , పెద్ద ఘోరం. చంపడం కంటే కూడా ఓ దారుణం అని భావిస్తుంటారు. అలాంటిది మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఎలాన్ మస్క్ ను ఏపీలో కంపెనీ పెట్టమని అడగడం ఏంటో అనే అర్ధం వచ్చేలా పూనమ్ ట్వీట్ చేసిందని చెప్పి జనసేన శ్రేణులు అంటున్నారు. ఎలాన్ మస్క్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారుగా.. అది సమస్య కాదా? అంటూ పూనమ్ చేసిన పోస్టును సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం మీద పూనమ్ ఈ రకంగా కూడా వార్తల్లో నిలిచింది.

Read Also : Balakrishna Slaps His Fan : ప్రచారంలో అభిమాని ఫై చేయి చేసుకున్న బాలకృష్ణ