Site icon HashtagU Telugu

Poonam Kaur: మహిళలపై అభిమానం చూపిస్తున్న ఫేక్ లీడర్లు

Poonam Kaur

New Web Story Copy 2023 07 17t124014.317

Poonam Kaur: సినీ నటిగా ఆకట్టుకున్న పూనమ్ కౌర్ ప్రస్తుతం రాజకీయాలపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆమె అనేక మార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా అందులో తప్పును ఎత్తిచూపే పూనమ్ కౌర్ తాజాగా మరో ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేయడం విశేషం. కాగా ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో జనసేన కార్యకర్తలే చెప్తున్నారు. పూనమ్ కౌర్ ట్వీట్ పై మండిపడుతూ ఆమె ట్వీట్ కు రీట్వీట్ చేస్తున్నారు.

పూనమ్ కౌర్ ట్వీట్ లో ఏమని ప్రస్తావించిందంటే… ఆంధ్రప్రదేశ్ మహిళల హక్కులపై గొంతుచించుకుంటున్న నకిలీ లీడర్లను నమ్మొద్దని ప్రజలకు సూచించింది. మహిళలపై అంత ప్రేమ ఉంటె లైంగిక వేధింపులు ఎదుర్కొన్న రెజ్లర్లు ఢిల్లీలో నెలలుగా నిరసన తెలిపారు, వారి సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు అంటూ ఘాటుగా విమర్శించారు పూనమ్ కౌర్. తమ సొంత ప్రయోజనాల కోసమే మహిళలపై అభిమానాన్ని, ప్రేమను కురిపిస్తున్నారని మండిపడింది. ఇలాంటి ఫేక్ ప్రేమలను నమ్మి మోసపోకండి అంటూ ఆమె పోస్ట్ చేసింది. అయితే ఆ పోస్ట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే పెట్టారని జనసైనికులు మండిపడుతున్నారు.

Read More: Carlos Alcaraz: వింబుల్డన్‌‌లో సరికొత్త విజేతగా నిలిచిన కార్లోస్ అల్కరాజ్ ఎవరు..? 20 ఏళ్లకే చరిత్ర సృష్టించాడు..!

Exit mobile version